AP Speaker: మీరు అసలు ప్రతిపక్ష నాయకుడేనా? | AP Assembly LIVE: Speaker Fires on Chandrababu Naidu - Sakshi Telugu
Sakshi News home page

మీరు అసలు ప్రతిపక్ష నాయకుడేనా?

Dec 11 2019 10:30 AM | Updated on Dec 11 2019 3:08 PM

Andhra Pradesh Assembly Session: Speaker Angry on Chandrababu - Sakshi

ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పద్ధతది? మీరు అసలు ప్రతిపక్ష నాయకుడేనా?

సాక్షి, అమరావతి: స్పీకర్ స్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై చర్చ సందర్భంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు మైక్‌ ఇవ్వకపోవడంతో ‘మర్యాదగా ఉండదంటూ’ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో స్పీకర్‌ ఆగ్రహం చెందారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు సభలో అమర్యాదగా వ్యవహరించడాన్ని స్పీకర్‌ తీవ్రంగా గర్హించారు.

స్పీకర్‌పై విరుచుకుపడుతున్న చంద్రబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి

‘ఎవరికి మర్యాద ఉండదు? మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. మర్యాద లేకుండా మీకు ఏం బిహేవ్‌ చేశాం? మీ అనుభవం ఎవరికి కావాలండీ? మీరూ సభ్యత, మర్యాదగా ఉండాలా. ఆగండి సార్‌ ఆగండి. సంయమనం పాటించండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వారి మీద ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పద్ధతది? మీరు అసలు ప్రతిపక్ష నాయకుడేనా? ఇలా వ్యవహరించడం​ కరెక్ట్‌ కాదు. స్పీకర్‌ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదంటనే నేనే రికార్డుల నుంచి తొలగిస్తా’ అని సభాపతి సీతారాం అన్నారు.

సంబంధిత వార్తలు...

ఇంగ్లిష్‌పై బాబుది దారుణమైన విధానం: సీఎం జగన్‌

వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం

మార్షల్స్‌తో టీడీపీ నేతల గొడవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement