పచ్ఛి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి | Ambati Rambabu takes on Digvijay Singh | Sakshi
Sakshi News home page

పచ్ఛి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి

Aug 5 2013 5:34 PM | Updated on Mar 18 2019 9:02 PM

అంబటి రాంబాబు - Sakshi

అంబటి రాంబాబు

రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో  ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిపై సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కాంగ్రెస్ పది తలల రాక్షసి అని విమర్శించారు. ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి కాంగ్రెస్ పార్టీదని ఆయన దుయ్యబట్టారు. విభజనపై వైఎస్ఆర్ సిపి అభిప్రాయం అనేక సార్లు స్పష్టం  చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు.

 షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అవడం పట్ల అంబటి సంతోషం వ్యక్తం  చేశారు. వైఎస్ఆర్ సిపి తరఫున షర్మిలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement