‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం‌’ | ambati rambabu takes on cm chandrababu and suggest file case against jc brothersఢ | Sakshi
Sakshi News home page

‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం‌’

Mar 4 2017 5:44 PM | Updated on Jul 25 2018 4:42 PM

‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం‌’ - Sakshi

‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం‌’

కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, కేసులంటూ పెడితే ముందు బస్సు ప్రమాదంతో 11మంది ప్రాణాలు బలితీసుకున్న జేసీ బ్రదర్స్‌పైనే పెట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌: కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, కేసులంటూ పెడితే ముందు బస్సు ప్రమాదంతో 11మంది ప్రాణాలు బలితీసుకున్న జేసీ బ్రదర్స్‌పైనే పెట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌ పదజాలం దారుణంగా ఉందని, వారి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై చాలా దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్ల రామయ్య భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆయన జేసీ బదర్స్‌, వర్ల రామయ్య, చింతమనేని మాటలు సరికాదని అన్నారు. మూడేళ్లు పరిపాలన చేసిన ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి లేదని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్నారని, చంద్రబాబు సాక్షిగా జేసీ నోరు జారారని, ఇంకా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముందు అరెస్టు చేయాల్సింది జేసీ బ్రదర్స్‌నేనని అన్నారు. హత్యారాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం చంద్రబాబుదేనని, ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబే ధ్వజమెత్తారు. వంగావీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.



Advertisement
Advertisement
 
Advertisement
Advertisement