ఏడుకొండల వాడికి ఏకాంత సేవలు

All Services Will Be Held Solitary In Tirumala For A Week - Sakshi

యథావిధిగా నిత్యకైంకర్యాలు

భోగశ్రీనివాసమూర్తికి మేలుకొలుపు

శాస్త్రోక్తంగా అష్టోత్తర శతనామార్చన

తులసీ దళాలతో శ్రీవారికి అర్చన

నిత్యకల్యాణం.. పచ్చతోరణం.. నిత్యోత్సవం.. గోవిందనామస్మరణలు.. ఎళ్లవేళలా భక్త జన సందోహం.. స్వర్గాన్ని తలపించే భూలోక వైకుంఠం.. ఇదీ వేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమల క్షేత్రం. అయితే కోవిడ్‌ వ్యాప్తి కారణంగా ఆ కలియుగవైకుంఠం నేడు భక్తులు లేక బోసిపోయింది. ఏడుకొండల వాడికీ సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయి.  

సాక్షి, తిరుమల:  నిత్యకల్యాణం.. పచ్చతోరణంగా విరాజిల్లుతున్న కలియుగ వైకుంఠవాసుడికి వారం రోజుల పాటు అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. కోవిడ్‌ మహమ్మారి విశ్వవ్యాప్తంగా  అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని పూర్తిగా మూసివేయకుండా స్వామి వారికి జరిగే నిత్యకైంకర్యాలు జరుపుతున్నారు. వేకువజామున 3 గంటలకు వేంకటేశ్వరునికి సుప్రభాత సేవను నిర్వహించారు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా అంటూ అర్చకులు, ఏకాంగులు, భోగ శ్రీనివాసమూర్తికి మేలుకొలుపు సేవలను నిర్వహించారు. అనంతరం ప్రాతఃకాలారాధన నిర్వహించారు.


వేణుగోపాల దీక్షితులు

సుగంథం వెదజల్లే పుష్పాలను మాలలుగా కూర్చి  భోగశ్రీనివాసమూర్తికి, మూలమూర్తికి, గర్భాలయంలో ఇతర దేవత మూర్తులకు మాలలను సమర్పించారు. తోమాల అనంతరం స్వామివారికి తోమాల దోషాలు, వడలు లడ్డులు నివేదించారు. అటు తరవాత ఆస్థానం (కొలువు) నిర్వహించారు. శనివారం రోజుకు సంబంధించిన తిథి, నక్షత్రం, గ్రహ సంచారంపై పంచాంగ శ్రవణం చేసి, స్వామివారికి వినిపించారు. అనంతరం వేంకటేశ్వరునికి సహస్రనామార్చన నిర్వహించారు. అర్చన జరిగే సమయంలో స్వామివారి పాదపద్మాలపై తులసీ దళాలతో అర్చన చేశారు. (ప్రాతఃర్నివేదన) మొదటి గంటలో వైద్య నివేదన జరిపారు. స్వామివారికి నిత్యం నివేదించే మాత్రా, ఇతర ప్రసాదాలు శ్రీనివాసునికి నైవేద్యంగా సమర్పించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: దేశంలో తొలిసారి ఓ రాష్ట్రం షట్‌డౌన్‌  

శ్రీవారి సన్నిధిలో ప్రబంధ శాత్తుమొరను ఆగమోక్తంగా చేశారు. జీయంగార్లు, ఏకాంగులు, అర్చకులు ప్రబంధ శాత్తుమొర అలకించారు. తరువాత మధ్యాహ్నికారాధన చేశారు. అర్చకులు స్వామివారికి ఉపచారాలు సమర్పించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండో గంట (మాధ్యాహ్నిక నివేదన)లో స్వామి వారికి శుద్ధన్నాం, ఇతర విశేష ప్రసాదాలు సమర్పించారు. రెండో గంట తరువాత గర్భాలయంలో కొలువుదీర్చిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని మండపంలో వేం

చేపు చేసి, లోక కల్యాణార్థం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం చేశారు. యథావిధిగా స్వామివారికి సాయంత్రం ఆరాధన నిర్వహించారు  అనంతరం స్వామివారికి తోమాల సేవ జరిపారు. మంత్రపుష్పం, నక్షత్ర హారతి కర్పూర హారతి సమర్పించారు. అనంతరం స్వామి వారికి సాయంత్రం తోమాల దోసె, వడలు, లడ్డులు నివేదించారు. తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామార్చన ఏకాంతంగా నిర్వహించారు. చివరి నివేదన (మూడో గంట)లో స్వామి వారికి అన్నప్రసాదం, పెద్ద దోసెలు, పణ్యారాములు నివేదించారు.

చివరగా స్వామి వారికి ఏకాంత సేవ 9 గంటలకు నిర్వహించారు. ఏకాంత సే వలో ఫలాలు, ద్రాక్ష, శర్కరి క్షీరం, కలకండ, బాదం పప్పు, జీడిపప్పుతో తయారు చేసి న ఏకాంత సేవ ప్రసాదాన్ని స్వామి వారికి నైవే ద్యం సమర్పించి, ఆలయ తలుపులను మూసివేసి, వాటికి తాళం వేసి పెద్ద జీయ్యంగారు మఠంలో తలలు ఉంచారు. యథావిధిగా శనివారం ఉదయం సుప్రభాతసేవతో స్వామివారికి మేలుకొలుపు సేవ నిర్వహించారు.  చదవండి: హార్సిలీహిల్స్‌కు కోవిడ్‌ ముప్పు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top