అసభ్య పోస్టింగులపై చర్యలు తీసుకోవాలి | Action Should Be Taken On Indecent Postings Says Rk Roja | Sakshi
Sakshi News home page

అసభ్య పోస్టింగులపై చర్యలు తీసుకోవాలి

Dec 20 2019 3:57 AM | Updated on Dec 20 2019 3:57 AM

Action Should Be Taken On Indecent Postings Says Rk Roja - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజాతోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, పార్టీ మహిళా కార్యకర్తలపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు కోరారు. ఈ మేరకు వారు అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలసి గురువారం ఫిర్యాదు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళా నేతలపై అభ్యంతరకరమైన దూషణలతో కూడిన పోస్టింగ్‌లు పెట్టడం అవమానకరమని పేర్కొన్నారు. ఈ పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. దీనిపై అదనపు డీజీపీ స్పందిస్తూ.. నిందితులు ఎంతటివారైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిళ్లం గోళ్ల శ్రీలక్ష్మి, ఏపీ మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, జమ్మలమడక నాగమణి, బొట్టా కనకదుర్గ, సుధారాణి, హిమబిందు, అనిత, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement