రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డీఈఓ | acb officials caught deo red handed while taking bibe | Sakshi
Sakshi News home page

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డీఈఓ

Jan 27 2017 9:59 PM | Updated on Aug 17 2018 12:56 PM

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డీఈఓ - Sakshi

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డీఈఓ

ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.30 వేల లంచం తీసుకుంటూ జిల్లా విద్యాశాధికారి (డీఈఓ) సూర్యప్ర‌కాశ్‌ తమ తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని ఏసీబీ అధికారులు తెలిపారు.  చీరాలకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు అనుమతి ఇచ్చేందుకు డీఈఓ కొంతమేర డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లంచం ఇచ్చేందుకు వారు కూడా అంగీకరించారు. డీఈవో సూర్యప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్ రమణ నేడు వారి వద్ద నుంచి రూ.30వేలు  తీసుకుంటుండగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement