కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు | Above 1050 crores from Central to State for Revenue deficit replacement | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు

Apr 4 2020 4:56 AM | Updated on Apr 4 2020 4:56 AM

Above 1050 crores from Central to State for Revenue deficit replacement - Sakshi

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 
► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద ఏప్రిల్‌ నెలకు కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్ల విడుదల చేసింది.
► 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. 
► రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
► దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్‌ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement