ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ | AAP leader Prashant Bhushan faces ire of telangana,samaikyandhra flak | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ

Jan 18 2014 3:46 PM | Updated on Sep 27 2018 5:59 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ - Sakshi

ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ

ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే నేపథ్యంలో ఏవీ కాలేజీలో ఆమ్‌ఆద్మీపార్టీ కార్యకర్తలు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ఆప్ ముఖ్యనేత ప్రశాంత్ భూషణ్ హాజరు అయ్యారు.  ఆయన ఎదుట తెలంగాణ, సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement