బొజ్జ గణపయ్య కింద పడి యువకుడు మృతి | A young man died under ganapati Idol | Sakshi
Sakshi News home page

బొజ్జ గణపయ్య కింద పడి యువకుడు మృతి

Sep 27 2015 9:20 AM | Updated on Sep 3 2017 10:05 AM

వినాయకుడి నిమజ్జనం సమయంలో విగ్రహం కింద నీటిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం సమీపంలోని బహుదానదిలో శనివారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

వినాయకుడి నిమజ్జనం సమయంలో విగ్రహం కింద నీటిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం సమీపంలోని బహుదానదిలో శనివారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఓ విగ్రహాన్ని నిమజ్జనం కోసం బహుదానది పాయకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని నిమజ్జనం కోసం నీటిలో వదిలిన సమయంలో ముత్యాలమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థి సురేష్‌రెడ్డి (21) విగ్రహం కింద పడి నీటిలో మునిగిపోయాడు. తోటి వారు గుర్తించి విగ్రహాన్ని తొలగించడానికి 20 నిమిషాల సమయం పట్టింది. అప్పటికే సురేష్‌రెడ్డి మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement