జీడిపప్పు గోదాములో భారీ అగ్ని ప్రమాదం | a huge fire in Cashew nuts warehouses | Sakshi
Sakshi News home page

జీడిపప్పు గోదాములో భారీ అగ్ని ప్రమాదం

Nov 21 2015 8:45 AM | Updated on Sep 5 2018 9:45 PM

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద జీడిపప్పు గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  యువశంకర్ ట్రేడర్స్‌కు చెందిన గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం 7 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2వేల బస్తాల జీడిపప్పు తగలబడి పోయిందని గోడౌన్ నిర్వహాకులు తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement