చంద్ర అంకుల్.. | 9yr Girl keerthi meets Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్ర అంకుల్..

May 17 2015 2:45 AM | Updated on Sep 3 2017 2:10 AM

చంద్ర అంకుల్..

చంద్ర అంకుల్..

సీఎం చంద్రబాబును చూడాలన్న తొమ్మిదేళ్ల బాలిక కీర్తి కోరిక నెరవేరింది.

 సీఎం చంద్రబాబును చూడాలన్న తొమ్మిదేళ్ల బాలిక కీర్తి కోరిక నెరవేరింది. బోన్‌మారో సమస్యతో బాధపడుతున్న బాలిక శనివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకుంది. ‘చంద్ర అంకుల్’ అంటూ పలకరించిన కీర్తిని సీఎం దగ్గరకు తీసుకొని కుశల ప్రశ్నలు వేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులు రామకృష్ణ, కవితలను అడిగి తెలుసుకున్నారు.

బాబును చూడాలన్న కీర్తి కోరికను ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ పుష్పాదేవి జైన్ నెరవేర్చారు. కీర్తి వైద్యం కోసం ఆమె పేరుపై రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తామని సీఎం  హామీ ఇచ్చారు.                              

Advertisement
 
Advertisement
Advertisement