టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగిన ఘటనలో అడ్డుకున్న పోలీసులు తీవ్రంగా ....
► ముద్దాయిల్లో మాజీ ఎమ్మెల్యే కొమ్మి
► గూడూరు జడ్జి సంచలన తీర్పు
పొదలకూరు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగిన ఘటనలో అడ్డుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన కేసులో గూడూరు జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాం ఇరువర్గాలకు చెం దిన 97 మందికి ఆరు మాసాల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చె ప్పారు. ఎస్సై కే.ప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు..19-07-2000 సంవత్సరంలో పొదలకూరు మండలంలోని సూరాయపాళేం గ్రామంలో పాఠశాల భవన ప్రారంభోత్సవంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాలకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు.
ఇరువర్గాలను అదుపు చేసే నేపథ్యంలో అప్పటి ఎస్సై రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ కంపా ప్రసాద్‌రా వు అప్పట్లో రెండు పార్టీలకు చెందిన 117 మందిపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం బరు 69/2000 కింద పోలీసులు కేసునమోదు చేశారు. 117 మందిలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, అప్పటి సూరాయపాళేం సర్పంచ్ పులి సుబ్బారెడ్డిలు ఉన్నారు. సుదీర్ఘకాలం గూడూరు కోర్టులో కేసు నడిచిన తర్వాత నిందితులకు శిక్షలు పడ్డాయి.
ఈ కేసులో ఉన్న 117 మందిలో 20 మంది వయోభారం మీ దపడి, వివిధ కారణాల వల్ల మృతి చెందారు. మిగిలిన 97 మందికి శిక్షణలు పడ్డాయి. శిక్షణలు ప డిన వారిలో ఏఎస్‌పేట మండలం విజిఆర్ సుబ్బారెడ్డి, పొ దలకూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, నావూరు, సూరాయపాళేం, మాముడూరు తదితర గ్రామాలకు చెందిన టీ డీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ(ప్రస్తుతం) నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.15ఏళ్ల తర్వాత పదుల సంఖ్యలో నిందితులకు శిక్షలు పడటం, సుదీర్ఘ రాజకీయాల్లో కొనసాగుతు న్న నాయకులు కా వడం వల్ల జి ల్లాలో ఈ కేసు సంచల నాత్మక తీర్పుగా మారింది. ఈ కే సులో ఏపీపీలు గా నాగేశ్వర్రావు, రమేష్‌లు కేసును వాదించారు.