400 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక | 400 people join in ysrcp | Sakshi
Sakshi News home page

400 మంది వైఎస్సార్‌ సీపీలో చేరిక

Feb 18 2018 9:10 AM | Updated on May 29 2018 4:40 PM

గొల్లప్రోలు (పిఠాపురం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చోబ్రోలులో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో శనివారం 400 మంది పార్టీలో చేరారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తొలుత స్థానిక శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నూకాలమ్మ గుడి వద్ద  రావు రవిబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సుమారు వందమంది పార్టీలో చేరారు.

 మెయిన్‌రోడ్డులో ఓరుగంటి స్వామి ఆధ్వర్యంలో 50మంది యూత్‌ సభ్యులు పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే స్థానిక యాదవుల రామాలయం వద్ద మట్ల సత్తిబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 50మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక వంటర్ల రామాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు లోకారెడ్డి గణేష్‌తో పాటు మరో 50మంది పార్టీలో చేరారు. ఎస్సీ పేటలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో వంద మంది మహిళలు, యువకులు పార్టీలో చేరారు. రథంబాట వీధిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి రాంబాబు ఆధ్వర్యంలో 50 మంది పార్టీ కండువా కప్పుకున్నారు.  పార్టీ గ్రామ అధ్యక్షుడు పుప్పాల బాబులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement