గోడ కూలి నలుగురు చిన్నారులు మృత్యువాత | 4 children die in freak accident | Sakshi
Sakshi News home page

గోడ కూలి నలుగురు చిన్నారులు మృత్యువాత

Nov 17 2015 6:00 PM | Updated on Sep 3 2017 12:37 PM

భారీ వర్షాలు నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. గోడకూలి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : భారీ వర్షాలు నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. గోడకూలి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామం శివారు బోయపల్లిలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా హఠాత్తుగా స్లాబ్ కూలి వారిపై పడింది. దీంతో నలుగురూ మృత్యువాతపడ్డారు. జేసీబీ సాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement