దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం | 3.9 kg gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

Mar 15 2014 8:41 AM | Updated on Sep 2 2017 4:45 AM

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

బ్యాంకాక్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన దంపతులను శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్‌  విమానాశ్రయంలో బంగారం కిలోలకు కిలోలు పట్టుబడుతోంది. తాజాగా బ్యాంకాంక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన దంపతుల నుంచి 3.9 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 20 కిలోల బంగారం పట్టుబడింది. అరబ్‌ దేశాల్లో బంగారం ధర , టాక్స్‌లు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి బంగారాన్ని తీసుకువస్తున్నారు. కొంతమంది స్మగ్లర్లు బూట్లలో, అండర్‌వేర్‌లలో పెట్టుకుని తీసుకు వచ్చినా.. స్కానర్స్‌ వద్దకు వచ్చే సరికి అడ్డంగా దొరికి పోతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement