పోలీసుల అదుపులో 21 మంది ఎర్రచందనం కూలీలు | 21 Red Sandalwood labour Arrested in Chittoor District | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 21 మంది ఎర్రచందనం కూలీలు

Jul 30 2014 8:21 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది.

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో పోలీసులు గత అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తులు ఎర్రచందనం కూలీలమని చెప్పారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిని వారాంత తమిళనాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement