అగ్నికి ఆహుతైన రెండు కార్లు | 2 cars catch fire in vijayawada | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన రెండు కార్లు

Apr 30 2016 10:03 AM | Updated on Sep 5 2018 9:45 PM

విజయవాడ నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లు అనుమానాస్పద స్థితిలో కాలి పోయాయి.

విజయవాడ: విజయవాడ నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లు అనుమానాస్పద స్థితిలో కాలి పోయాయి. స్థానిక సాంబమూర్తి రోడ్డులోని కార్‌వాష్‌ సెంటర్ ఎదురుగా రెండు కార్లను పార్కు చేసి ఉంచారు. శనివారం తెల్లవారు జామున ఒక కారులో వ్యాపించిన మంటలు దాని పక్కనే ఉన్న మరో కారుకు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న కార్లను స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. ఆకతాయిలు నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement