లారీ-ఆటో ఢీ..ఒకరి మృతి | 1 died, 3 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీ-ఆటో ఢీ..ఒకరి మృతి

Jun 17 2015 10:26 AM | Updated on Aug 30 2018 3:56 PM

విజయనగరం జిల్లా కోమరాడ శివారులోని మలుపువద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కోమరాడ: విజయనగరం జిల్లా కోమరాడ శివారులోని మలుపువద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. పార్వతీపురం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పార్వతీపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో వారి వివరాలు తెలియలేదు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement