breaking news
-
బాబు.. బాదుడే బాదుడు
విద్యుత్ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు. సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్‌లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్‌లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్‌తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.⇒ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్‌లో 10 శాతం సెస్ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథచంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్అండ్బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపుచంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.బాబు వస్తూనే బాదుడు మొదలు‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయటపెట్టుకున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ అనుమతి లభించింది. అంటే, బాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్‌కు సమానంగా అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.తాగునీటిపై యూజర్ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బాబు పాలనలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కట్లేదు
సాక్షి,అమరావతి: అన్నదాతలను ఆదుకోవడంతోపాటు, కనీస మద్దతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగును పూరి్తగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక కంది రైతులు విలవిలలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘2025 – 26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కనీస మద్దతు ధర క్వింటా రూ.8 వేలు. కానీ ఆ ధర దక్కడం లేదు. రైతులు క్వింటా రూ.6,500 నుంచి రూ.6,600 వరకు అయినకాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. పొరుగున కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం స్వయంగా కంది కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కంది పంట ఉత్పత్తి 1.71 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 1.17 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది.’ అని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నదీ అదే దుస్థితి ‘మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1,500 నుంచి రూ.1,900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు’ రైతు కంట కన్నీరు మంచిది కాదు.. అది అరిష్టం ‘రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రకృతివైపరీత్యాలకు దిగుబడి తగ్గి, ధరలు పడిపోవడంతో దిక్కుతోచక విలపిస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ‘రైతు కన్నీరు మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం’ అని ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. -
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. -
‘క్యాబినెట్లో వ్యతిరేకించకుండా ఇలా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి?’
రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి. జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్‌రెడ్డి. కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
‘చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు’
తాడేపల్లి : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని, ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. అయినా చంద్రబాబు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేదు. ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారు. మెడికల్ కాలేజీల కోసం ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాలేజీలను స్వాధీనం చేసుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని అర్ధం చేసుకున్నారు. కానీ ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పతరికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్ వేయించారు. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని స్పష్టం చేశారు. -
బాబు మరో మోసం.. రాయచోటి ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.కాగా, ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్‌రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ పుణ్యమే. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. -
‘మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని.. తన జెండా, తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని.. ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుంది. వారి పాలనలో ఆలోచనలు కూడా అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి’’ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.‘‘మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.. ఈ మూడు పార్టీలకు విడిగా వైఎస్సార్సీపీనీ ఓడించే బలం ఉందా..?. వారికి సొంతగా గెలిచే బలం లేదు కాబట్టే మూడు పార్టీలు జత కట్టాయి. మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు. మీరు మూడు పార్టీలు కలిసి ప్రజలకు ఏమైనా మేలు చేశారా...?. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కేవలం చంద్రబాబు ఇచే ప్యాకేజీతో నోరు మూసుకున్నాడు. నువ్వు జగన్ చేతిలో రేఖలు తుడుపుతావా..?. ఓ పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదు. నువ్వు జగన్‌ను ఏమి చేయగలవు..?’’ అంటూ రాచమల్లు నిలదీశారు.‘‘ఈ దేశంలో చంద్రబాబు అంత అవకాశవాది ఎవరూ లేరు. ఆయన జత కట్టని పార్టీ లేదు.. ఆయనకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది. బీజేపీ పెద్ద ముత్తయిదువు పాత్ర.. ఏమీ చేయలేదు కానీ పేరుకు ఉంటుంది. 2 శాతం, 30 శాతం ఓట్లు ఉన్న వీళ్లు 40 శాతం ఓట్లున్న జగన్‌ను ఏమీ చేయలేరు. అందుకే జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు అని వాళ్లే అంటున్నారు. వీళ్లెవరికీ జగన్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదని వాళ్లకే తెలుసు. మీ మేనిఫెస్టోను ఆనాడు బీజేపీ ముట్టుకోలేదు. కానీ జగన్ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు’’ అని రాచమల్లు గుర్తు చేశారు.‘వీళ్ళంతా రాజకీయంగా అవిటి వాళ్ళు.. ఒకరి ఊతం లేనితే మరొకరు లేరు. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక్క వైఎస్ జగన్ మాత్రమే చేశాడు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కడు కాబట్టే.. సొంత ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టాడు. జగన్ పొత్తుకు పోలేదంటే నైతిక విలువలు ఉన్నాయని అర్థం.. తన పాలనని నమ్ముకున్నాడు. ఓటమిని ఆహ్వానించాడు. కష్టాలను ఆహ్వానించాడు కానీ తలొగ్గలేదు. అలాంటి విలువలు కలిగిన జగన్ మా నాయకుడు అయినందుకు గర్వపడుతున్నా. నా శ్వాస ఆగిపోయేంత వరకు జగన్ తోనే నా ప్రయాణం..2029 వస్తుందంటే మీ దడ పుడుతోంది..జనంలో జనం బలమెంతో మీకు తెలుసు. అందుకే మీరు గెలిచినా మీకు ఆదరణ లేదు.. జగన్ ఒడినా ఆదరణ ఉంది. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. తమ ఓట్లకు, సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుంది..?. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే అన్నమయ్య జిల్లా రాకుండా ఉంటుందా?. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదు’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు. -
ఎంతకాలమీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు బాబూ!
మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. రాజు అంటే పరిపాలకుడు మొండివాడుగా ఉండొద్దు అన్న అర్థమూ ఉంది దీంట్లో. పట్టు విడుపుల్లేని రాజకీయం, ప్రజాస్వామ్యంలో విజ్ఞత, విచక్షణల అవసరమని గతానుభావాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాక్షేమమే పరమావధి కావాలి మినహా వ్యక్తిగత పట్టింపులు కాదు. ఈ విషయాలను విస్మరిస్తే ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. అచ్చం... ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్నది ఇదే. ఎవరు కాదన్నా.. వద్దంటున్నా ప్రైవేటీకరణకు మంకుపట్టు పట్టుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఈ అహేతుక నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ప్రజల అభిమతానికి భిన్నంగా నడుచుకుంటే రాజకీయ పార్టీలకు ఇక్కట్లు తప్పవన్న సంగతి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. తెలుగువారంతా కలిసి ఉండాలనుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగా ‘‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే’’ అన్న సందేశాత్మక పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీని అక్రమంగా లాగేసుకున్న తరువాత చాలాకాలం అదే విధానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన మహానాడులోనూ టీడీపీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ 2009 వచ్చేసరికి ప్రత్యేకవాదంపై ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ నేతలు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. అది ఆంధ్రుల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మారింది. దాంతో 2009లోనూ ఓటమిపాలైంది. 1999లో విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని పాదయాత్ర లో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని ఎద్దేవ చేశారు. 2004 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది ఒక కారణమైంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకుని గత టర్మ్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ను కొనసాగించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలు, తదుపరి మాటలు మార్చడం గురించి ఇక్కడ చర్చ కాదు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు. అతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వపరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. జగన్ వారి పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నందంతా ఒక స్కామ్ అని, ఇందులో ప్రైవేటు సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా తెలిపారు. బహుశా ప్రజా వ్యతిరేకత, జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో, ఏమో కాని, ప్రైవేటు సంస్థలు కాలేజీలకు టెండర్లు వేయలేదు. నాలుగు కాలేజీలకు గాను ఆదోని కాలేజీకే ఒక ప్రైవేటు వైద్య సంస్థ కిమ్స్ మాత్రం బిడ్ వేసిందని ప్రభుత్వం చెప్పింది. అయితే తాము బిడ్ వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్‌లో పనిచేసే ఒక డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పని చేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్లీ సమీక్ష చేసి మొండిగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేటు సంస్థలకు ఆర్థిక, ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడే ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీలకోసం వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నిటిని ప్రైవేటు వారికి అప్పగించడం ఏమి హేతుబద్దత? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా, రెండేళ్లపాటు సిబ్బందికి జీతాలూ ఇస్తారట. అయినా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేటు సంస్థలకు వయబిలిటి గ్యాప్ ఫండ్ కూడా ఇస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పని చేసిందన్నది ప్రజాభిప్రాయంగా ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. అదే టైమ్‌లో ఈ కాలేజీలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం ఆస్తులు ఇచ్చిన నష్టం రావచ్చునని ప్రైవేటు సంస్థలు అనుమానించాయా? లేక చంద్రబాబు బలహీనతను క్యాష్ చేసుకొన్ని మరిన్ని రాయితీలు పొందాలని అనుకుని ఉండవచ్చు. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానమే. కేంద్ర మంత్రి నడ్డా నిజంగానే అలా లేఖ రాసి ఉంటే దానిని బహిర్గతం చేసి ఉండేవారు కదా! ప్రజాధనం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995-2004 మధ్యకాలంలో 54 ప్రబుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ఆ ప్రైవేటు సంస్థలకు మంచి విలువైన భూములు కట్టబెట్టగా, అవి ఆ తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్‌లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు ఖాళీగా ఉండే సీట్ల టిక్కెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనినే వయబిలిటి గ్యాప్ ఫండ్ అంటారు. ఇదే సూత్రాన్ని మెడికల్ కాలేజీలకు వర్తిస్తారట. అత్యవసర సమయాలలో ఇలా చేస్తే ఫర్వా లేదు కాని, లేని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఇలా వృథా వ్యయం చేయవచ్చా? ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ టర్మ్‌లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికి సుమారు రూ.47 వేల కోట్ల రుణం తీసుకు వస్తున్నారు. కాని వైద్య కాలేజీలకు ఐదువేల కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో ఐదు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అదనంగా ఫించన్ పెంచి దానిని ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాని మెడికల్ కాలేజీలను నడపలేమని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆస్పత్రులు కార్పొరేట్ తరహాలోనే పనిచేసే స్థితి వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులే గొప్ప అన్నట్లు మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటూ కొత్త రాగం ఆలపించారు. పేదలకు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు వారికి కాలేజీలు ఇస్తారట.ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయో అందరికి తెలుసు. పోనీ ప్రైవేటు కాలేజీలు సొంతంగా భూమి సమకూర్చుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు పెట్టుకుంటే అదో పద్దతి అనుకోవచ్చు.ప్రభుత్వమే అన్ని సమకూర్చి,అప్పనంగా కాలేజీలను ప్రైవేటువారికి ఇవ్వడం ద్వారా పేదలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కాదు.కేంద్రం జగన్ టైమ్ లో ప్రభుత్వరంగంలో పనిచేసేలానే ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతిని దాచేయాలని యత్నిస్తున్నారు.కేంద్రం కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రభుత్వపరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావల్సినవారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ప్రజల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న ఈ మొండి నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఓర్వలేకే మా కార్యకర్తలపై అక్రమ కేసులు: తానేటి వనిత
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?..నల్లజర్ల సెంటర్లో వైఎస్సార్సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్‌ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్‌పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు. -
కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం(డిసెంబర్ 28) ఆయన వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్‌ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇప్పటికే ఇస్తున్నాం...ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. -
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు: మల్లాది విష్టు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు చీదరించుకంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండమీదకు తీసుకొస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం చోటు చేసుకుందని.. భక్తులు దైవ దర్శనానికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని గుర్తు చేశారు.చంద్రబాబు హయాంలో ప్రతిసారి హిందుత్వం మీద దాడి జరగడం పరిపాటిగా మారిందని.. తిరుపతి, అన్నవరం,కాశీబుగ్గ క్షేత్రమేదైనా కూటమి పాలనలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నా.. భక్తుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విష్టు ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్రంలో యధేచ్చగా గోవధ జరుగుతున్నా.. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం నిల్వలు పట్టుబట్టినా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు నిలదీశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:తిరుమలలో వరుస అపచారాలు..తిరుమలలో అధికారులు, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సభ్యుడు ఏకంగా మహాద్వారం గుండా వెళ్లాలని అక్కడున్న సిబ్బందితో గొడవపడి నానా రాద్ధాంతం చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన గోశాల నిర్వహణ దారుణంగా మారింది. అక్కడ తొలిసారిగా దాదాపు 190 గోవులు మరణించడం అత్యంత బాధాకరం.అదే విషయాన్ని వైయస్సార్సీపీ నాయకులు ఎత్తి చూపితే.. వారి మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కానీ అదే టీటీడీ పాలకమండలి సమావేశంలో గోశాల నిర్వహణ కష్టంగా ఉందని చర్చించడం ద్వారా మేం చెప్పిన అంశం నిజమేనని రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టీటిడీని రాజకీయ విమర్శలకు వేదికగా దుర్వినియోగం చేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 12న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్న సమయంలో స్వామివారి గేటు తాళాలు మూసివేయడంతో స్వామివారి నైవేద్య సమర్పణ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇది ఘోరమైన అపచారం. పాలకమండలి పాలనా, నిర్వహణ వైఫల్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు తిరుమలలో వ్యవస్థ పని చేస్తుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తూ కొంతమంది చెప్పులు వేసుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్ లోకి వెళ్తున్న ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.దేవాలయాల్లో వరుస అపచారాలు..కూటమి ప్రభుత్వం తరహాలో వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏరోజూ ఇలా జరగలేదు. కానీ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిత్యం దేవుళ్లని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక చేయెద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. లడ్డూ తయారీ నెయ్యిలో లేని కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తు వేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దాన్ని వాడుకుంటోంది.అదే విధంగా కాశీనాయన క్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రం, భక్తుల విశ్రాంతి భవనాలను టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందని.. అత్యంత అమానుషంగా బుల్డోజర్లతో కూలగొట్టారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. వైయస్.జగన్ హయాంలో అయితే ఇదే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అటవీ భూముల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వానికి, వైయస్.జగన్ ప్రభుత్వానికి ఇదే తేడా.వైయస్. జగన్ హయాంలోనే పరకామణి కోసం అత్యాధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించారు. కాబట్టే పరకామణి చోరీ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో మాజీ ఏవీఎస్ సతీష్ వేధింపులకు ఎవరు కారణం?, ప్రభుత్వ వేధింపులు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల నిర్వహణ అత్యంత అధ్వాధ్నాంగా తయారైంది. కేవలం టీటీడీ, కాశీనాయన క్షేత్రాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లోనూ ఇవే అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. 01–05–2025న సింహాచలం దేవస్దానంలో గోడకూలి 7 మంది సజీవసమాధి అయితే దానికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు? పర్వదినాన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పేతే ఎవరు జవాబూదారీతనంరాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అసాంఘిక కార్యకలాపాలకు విపరీతంగా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోతుంది. కోడిగుడ్లు తినడం, మద్యపానం, పేకాట వంటివి అష్టాదశ శక్తిపీఠ శ్రీశైలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పైగా కూటమి ఎమ్మెల్యే తప్పతాగి, స్వయంగా అటవీశాఖ సిబ్బంది మీద దాడులకు దిగడమేనా సనాతన ధర్మం. ఈ ఏడాది మే 18న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం అద్దేపల్లిపేటలో కోదండరామాలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. కల్కి, బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి విగ్రహాలను ధ్వంసం చేసి పక్కన పడేశారు. నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు, దాని మీద ఎలాంచి చర్యలు లేవు. ఈ ఏడాది నవంబరు 11న కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిమంది భక్తులు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగిప్రాణాలతో వస్తామో? రామో? అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగనే పక్కనే ఉన్న శ్రీకూర్మంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల... నక్షిత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్టుమార్టమ్ కూడా నిర్వహించకుండా ఈవో కార్యాలయం వెనుక వాటిని తగలబెట్టారు. ఇవన్నీ మీ పరిపాలనకు మచ్చుతునకలు.రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వ్యక్తికి ప్రభుత్వ నిధుల నుంచి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చారా? లేదా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. 2024–25 లో హిందూ ధర్మాన్ని కూటమి ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజార్చిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. తిరుపతిలో తొక్కిసలాటలో గతేడాది 6గురు చనిపోయారు. దానికి కారణమైన అధికారులను మరలా అదే స్ధానంలో నియమించారు. రెండు రోజుల క్రితం 24, 25 తేదీల్లో మరలా తొక్కిసలాట జరిగింది. మీకు అనుకూలంగా పని చేసే అధికారులు తప్పు చేసినా వారి మీద చర్యలు ఉండవన్నది స్పష్టమవుతోంది.సదావర్తి భూములను వేద పండితుల పోషణ కోసం ఇచ్చారు. అని అన్యాక్రాంతం కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపాడింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల కానుకులు వేసిన హుండీలకు కూడా భద్రత లేదు. అహోబిలంలో రూ.20 లక్షలు భక్తులు వేసిన కానుకలని స్థానిక ఎమ్మెల్యే మనుషులు కైంకర్యం చేస్తే.. కనీసం కేసు కూడా పెట్టలేదు. దేవాలయాల్లో పెరిగిన రాజకీయ జోక్యానికి ఇదే నిదర్శనం. ఆలయాల్లో చొరబడి రాజకీయజోక్యంతో నాశనం చేస్తున్నారు.వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని చిన్నతిరుపతిగా పేరు గాంచింది. 19–11–2025న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు... మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఫారసుతో వచ్చి.. డబ్బులు దొంగతనం చేస్తే కేసు పైలు చేశారు. దీని మీద కూటమి నేతలు నోరు మెదపరు. ఇవన్నీ ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలు.ఇవీ కూటమి ప్రభుత్వ ఘనతలు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో వదిలేసింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల నిర్వహణ కోసం, వేదపండితులు పోషణ కోసం దేవాలయాలకు భూములిస్తారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో ప్రకారం ఆలయాల భూములను తమకు తూచినట్లు, టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెట్టే విధంగా జీవో జారీ చేసింది. ఇది ఏ మేరకు ధర్మం? వైఎస్ జగన్ హయాంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని దోచిపెట్టే పని చేస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం అయిన.. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో.. 70 వేల మంది భక్తులున్న ఆలయంలో 3 నుంచి 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసారంటే ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో అర్ధం అవుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? దేవాదాయ, ధర్మాదాయ మరియు విద్యుత్ శాఖలకు మధ్య ఉన్న సమన్వయలోపానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ అసమర్థ పాలనకు తార్కాణం. అనంతపురం సింగనమలలో పుట్ పాత్ మీద సిరి రమణ అనే ఒక అర్చకుడు ఆందోళనకు దిగాడు. 150 ఏళ్లుగా వంశపారపర్యంగా ఆలయ అర్చకత్వం చేస్తుంటే.. వారిని గుడి నుంచి గెంటేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ కు అర్జీ ఇచ్చినా పట్టించుకోకపోవడం అత్యంత అమానుషం.ద్వారకా తిరుమలలో సైతం ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే గోవులు చనిపోతే.. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. కూటమి పాలన వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా పెద్ద మొత్తంలో గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతుంది. హిందూ సమాజానికి జరుగుతున్న అతిపెద్ద ద్రోహం ఇది. బాపట్ల ఎమ్మెల్యే సన్నిహితుడు గోడౌన్ లో పట్టుబడినా చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కర్నూలులో లే అవుట్ కి అడ్డంగా ఉందని అలయ గోడ కూల్చి వేసిన ఘటన చోటు చేసుకుంది.ఇంకా టీడీపీ ఎమ్యెల్యే ఒకరు బహిరంగంగా భగవద్గీతను అవమానించారు. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో ఆలయానికి చెందిన 28 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించమని హైకోర్టు ఆదేశిస్తే, మొత్తం 1036 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం జిల్లా రిజిస్టార్కు లేఖ రాసింది. అంటే కోర్టు ఆదేశాన్ని చూపి, మొత్తం భూమిపై కన్నేసి.. అలా ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఇనాం, ఎస్టేట్ భూములని చూపి, దాన్ని స్వాహా చేయడానికి కుట్ర చేశారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లు.వైఎస్ జగన్ హయాంలో దేవాదాయశాఖలో సంస్కరణలు:వైఎస్ జగన్ హయాంలో ఆలయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తిరుమలలో శ్రీవాణి పథకం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటే.. దానిపైనా విమర్శలు చేసి ఆనేక ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ఎన్నికల ముందు రద్దు చేస్తామని ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే వీరు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలనే తేలింది. మరోవైపు చంద్రబాబు హయాంలో గతంలో విజయవాడలో కూలగొట్టిన ఆలయాలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్మించారు. అసలైన హిందూ పరిరక్షకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేశారు.ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్ కల్యాణ్.. ఇంకా జగన్నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలపై సిట్ వేస్తారు. అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు. అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
‘బాబుకు నో విజన్.. కేవలం రాజకీయ అవకాశవాదమే’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజన్ లేదు.. కేవలం రాజకీయ అవకాశవాదమే ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తప్పించుకున్నవాడు ధన్యుడు అన్నట్లు చంద్రబాబు హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడాన్ని టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ అభిమానులు మాంసం తినటమూ తప్పేనా?. పొట్టేళ్లు, కోళ్లు ఎలా తినాలో ప్రభుత్వం చెప్పాలా?. జంతు బలి చట్టాలను టీడీపీ కూటమి నేతలు తెలుసుకోవాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు. వైఎస్ జగన్‌కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి, రెండు చోట్ల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు కొడితే, అది పెద్ద నేరం అన్నట్లు.. రాష్ట్రంలో గతంలో ఎక్కడా అలా జంతు బలి జరగనట్లు మీరు (సీఎం చంద్రబాబు), మీ హోం మంత్రి మాట్లాడుతున్నారు. దాని వల్ల సమాజం నాశనమై పోతున్నట్లు నిందిస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నట్లు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అలా చేసి హింసను ప్రేరేపిస్తున్నారు కాబట్టి, రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మరి జాతరలు, గ్రామోత్సవాల్లో కూడా జంతు బలులు సహజం. వాటిని కూడా తప్పు పడుతున్నారా? మొక్కుల కోసం జంతు బలి ఇచ్చిన వారిపైనా చర్యల తీసుకుంటారా? లేదా రాష్ట్రంలో జంతు బలులనే నిషేధిస్తారా?. వైఎస్ జగన్ ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్ల బలిని అంతగా తప్పు పడుతున్న మీకు.. హిందూపురంలో మీ బావమరిది నందమూరి బాలకృష్ణ గెలుపు తర్వాత పదుల సంఖ్యలో పొట్టేళ్లు నరికి, వాటి తలకాయలతో ఆయన ఫ్లెక్సీకి దండ వేశారు. అది కనిపించడం లేదా బాబు?. ఇంకా 2023లో మీ (చంద్రబాబు) పుట్టినరోజు సందర్భంగా మీ పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లు నరికి, రక్తంతో మీ ఫ్లెక్సీకి రక్త తర్పణం చేశారు. అంతెందుకు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, అనేకచోట్ల మీ ఫ్లెక్సీలు పెట్టి, బహిరంగంగా పొట్టేళ్లు నరికి, ఆ రక్తాన్ని మీ ఫ్లెక్సీలకు తర్పణం చేశారు. అవన్నీ నిజం కాదా? మరి వాటికేం సమాధానం చెబుతారు?. కదిరి దగ్గర జనసేన కార్యకర్త ఇంట్లో చిన్న గలాటా జరిగితే, దాన్ని కూడా వైఎస్సార్సీపీకి అంటగట్టి బురదచల్లే ప్రయత్నం చేశారు. చివరకు ఆ యువకుడి సోదరి, పూర్తి వివరాలు స్వయంగా చెప్పింది.మెడికల్ కాలేజీలు, శాంతిభద్రతల వైఫల్యం కప్పిపుచ్చేందుకే..రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. శాంతిభద్రతలు ఛిద్రమవుతుంటే.. గంజాయి బ్యాచ్‌లు పెరుగుతూ పదులు, వందల కేజీల్లో గంజాయి దొరుకుంటే.. మీ నేతలు తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటుంటే.. సగటు మనుషులు బిక్కుబిక్కుమంటూ పోలీసు స్టేషన్లకు వెళ్తుంటే.. ఎమ్మెల్యేలు చెప్పాలని వారు తిప్పి పంపిస్తుంటే ఇవన్నీ మీకు కనిపించడం లేదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతిభద్రతలపై మీకు లేఖ రాయలేదా? శాంతిభద్రతలే కాదు, ఏమీ లేదు ఇక్కడ.రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉద్యోగాలు లేవు. పెట్టుబడులు లేవు. ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్లా మీ పార్టీ దుర్మార్గమైన ఆలోచనలతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పి పుచ్చేందుకు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయిస్తే, మీరు చేస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారం అర్థమై, ఎవరూ బిడ్ వేయలేదు. అందుకే ఒక్కటంటే ఒక్కటీ సరైన బిడ్ రాలేదు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతోనే మెడికల్ కాలేజీల బిడ్లు వేయడానికి ఎవరూ రాలేదు. వీటన్నింటి నుంచి డైవర్షన్ కోసం, ఇప్పుడు ఫ్లెక్సీలు, రక్త తర్పణాలు అంటూ అనవసర రచ్చ చేస్తున్నారు.పోలీసులూ అది గుర్తు చేసుకోండి.. పోలీసు అధికారులకు కూడా చెబుతున్నాం. మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడం తగదు. టీడీపీ ప్రభుత్వంపై ప్రమాణం చేసి మీరు ఉద్యోగాల్లోకి రాలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. అనంతపురంలో రోడ్డు వేస్తుంటే టీడీపీ దిమ్మె కూలగొట్టారు. ఇక్కడ కాంట్రాక్టర్ మీ వాడు. అధికారులు మీ చెప్పుచేతల్లో ఉన్న వాళ్లు. జేసీబీ డ్రైవర్ కూడా మీవాడే. కానీ జనం మీద బలం చూపిస్తామంటే కుదరదు. పోలీసు శాఖ ఉన్నది న్యాయాన్ని రక్షించడం కోసం. ప్రజలకు రక్షణ కల్పించడం కోసం. అంతేకానీ, అధికార పార్టీ వారు చెప్పిందే చేయడం కోసం కాదు అని స్పష్టం చేశారు. -
రఘురామను రఫ్ఫాడిస్తున్న ఐపీఎస్
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే మరి.. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల గురించి.. చిత్రవిచిత్రమైన హావ భావాలతో మిమిక్రీ చేస్తూ ఎదుటివాళ్లను అవహేళన చేయడమే తన ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఒక పోలీస్ అధికారి నోటికి చిక్కారు.గతంలో తనను ఇబ్బంది పెట్టారంటూ అప్పటి సీఐడీ చీఫ్.. డీజీపీ పీవీ సునీల్ కుమార్‌ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆనాడు తన విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ రఘురామ పోస్టులు చేయడమే కాకుండా ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీనిపై సునీల్ దీటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ రఫ్ఫాడిస్తున్నారు.రఘురామ పాత చరిత్రను తవ్వుతూ సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగించారు. ఇదే తరుణంలో రఘురామ గతంలో బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సునీల్ కుమార్ చేతిలో అస్త్రాలుగా మారాయి.. దీనిపై అయన ఏమని పోస్ట్ చేసారంటే..‘‘కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’.. మూడు బ్యాంక్‌ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారు.. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆర్ఆర్ఆర్ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు. ఇలాంటి గజదొంగను, చీటర్‌ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా?..ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు. ఉప సభాపతి హోదాలో రఘురామకృష్ణ రాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే ఆయన వరకే అది పరిమితం అవుతుంది. మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తుననా.. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఒక వ్యక్తి వైపు కాదు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పౌరుడిగా నా బాధ్యత. 420 రఘురామ కృష్ణ రాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆ రిపోర్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతాయి. అందుకోసం నేను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్లు వేస్తాను. ఈ కేసులో 420 రఘురామకృష్ణ రాజు బయటపడటం జరగదు..అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పైగా దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. ఒక 420 కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్ను ఫణంగా పెట్టవద్దు. నేను చెప్పిన విషయాలు అసత్యం అయితే నా మీద చర్య తీసుకోండి. నేను సిద్ధం. నిజం కాబట్టి తక్షణం 420 రఘురామకృష్ణ రాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించాలి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణ రాజు ని అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చేయాలి. జై అమరావతి.. జై స్వర్ణాంధ్రప్రదేశ్… జై భీమ్' అంటూ సునీల్ ఎదురుదాడి కొనసాగించారు.తనను సస్పెండ్ చేయడం న్యాయమైతే కోట్లకు బ్యాంకులను ముంచిన రాజును కూడా సస్పెండ్ చేయాలనీ.. ఇదే చేస్తే ఒక శాసన సభ డీప్యూటీ స్పీకర్ సస్పెన్షన్ అనేది రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం అని.. ఆయనను సస్పెండ్ చేస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు పోతుందని అవహేళన చేసారు. ఇదిలా ఉండగా సునీల్‌కు అంబేద్కర్ యువజన సంఘాలు.. దళిత సంఘాలు సైతం మద్దతు పలుకుతుండగా అటు రఘురామ మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒంటరి అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం వాళ్ళు కానీ.. జనసేనావాళ్లు కానీ.. కనీసం బీజేపీ వాళ్ల కానీ ఒక్క ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు పెట్టలేదు. దీంతో సునీల్ కుమార్ నేరుగా రఘురామను టార్గెట్ చేసి ఆయన్ను, అయన కుటుంబాన్ని బ్యాంకుల దొంగగా సంభోదిస్తూ పరువు తీస్తున్నారు. దీనికి ఎదురు సమాధానం ఇవ్వలేక రఘురామ సైలెంట్ అయ్యారు.-సిమ్మాదిరప్పన్న -
దెందులూరులో టీడీపీ గూండాల అరాచకం
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి. పెదపాడు మండలం ఏపూరి గ్రామ వైఎస్సార్సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ పై పచ్చ మూకలదాడి చేశాయి.ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లివస్తున్న రామకృష్ణను టీడీపీ మూకలు అడ్డగించి దాడి చేశాయి. బాధితుడి బైక్ నెంబర్ ప్లేట్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫోటోలు ఉన్నాయని దాడికి దిగారు. బైక్‌పై వెళ్తున్న రామకృష్ణను కిందకి లాగి దాడి చేశారు. ఆపై అసభ్యంగా దూషించారు. తనపై టీడీపీ నేతలు దాడి చేసి, అసభ్యంగా దూషించారని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డిపై మనుబోలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి.. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా? అంటూ మండిపడ్డారు.కావాలనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవడం లేదు. కూటమినేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నేను బతికున్నంత కాలం అండగా నిలబడతా’’ అని కాకాణి పేర్కొన్నారు. -
‘కూటమి సర్కార్ పబ్లిసిటీ మీద బతుకుతోంది’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు...చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘అన్ని గుర్తు పెట్టుకుంటాం.. రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్‌ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు. -
ఈనాడు సంపాదకీయంపై YSRCP ఎస్సీ సెల్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేదిమరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్ నిప్పులు చెరిగారు.‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్‌కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్‌ని ప్రేమిస్తారు..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్‌పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు. -
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ జరిగింది..రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్‌కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
కూటమి గుండెల్లో అప్పుడే గుబులు?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్‌కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్‌బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘బాబూ.. రైతుల జీవితాలతో ఆటలా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. -
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు.


