28న పల్స్‌ పోలియో | Pulse polio campaign from Jan 28 to 30 | Sakshi
Sakshi News home page

28న పల్స్‌ పోలియో

Jan 21 2018 11:36 AM | Updated on Mar 21 2019 8:35 PM

Pulse polio campaign from Jan 28 to 30 - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: ఈ నెల 28న పల్స్‌ పోలియో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 70,895 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్లు అంచనా వేశామన్నారు. 80 పట్టణ, 316 గ్రామాల్లో, 443 గిరిజన ప్రాంతాల్లో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 113 మోబైల్, 17 ట్రాన్సిట్‌ పాయింట్ల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని అన్నారు. 3356 మంది టీం సభ్యులతో, 92 మంది సూపర్‌వైజర్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌ రాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement