చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక బౌల‌ర్‌ | SL-Asitha Fernando Completes 100 Wkts-Breaks Lasith Malinga Record | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక బౌల‌ర్‌

Nov 10 2026 5:21 PM | Updated on Nov 10 2026 5:28 PM

SL-Asitha Fernando Completes 100 Wkts-Breaks Lasith Malinga Record

Photo Credit: Twitter

రావ‌ల్పిండి వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బౌల‌ర్ అసిత‌ ఫెర్నాండో చ‌రిత్ర సృష్టించాడు. 29 ఏళ్ల ఫెర్నాండో మ్యాచ్‌లో త‌యాబ్ ఆరిఫ్‌, స‌ల్మాన్ అగా వికెట్లు తీసి వంద వికెట్ల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అసిత‌ ఫెర్నాండో లంక దిగ్గ‌జ బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ రికార్డును బ‌ద్ద‌లుకొట్ట‌డం విశేషం. 

శ్రీలంక త‌ర‌ఫున టెస్టుల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసుకున్న ఫాస్టెస్ట్ బౌల‌ర్‌గా అసితా ఫెర్నాండో నిలిచాడు. కేవ‌లం 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించిన ఫెర్నాండో ఒక్క మ్యాచ్ త‌క్కువ తేడాతో మ‌లింగను (30 మ్యాచ్‌లు) అధిగ‌మించ‌డం విశేషం. 

ఇక లంక త‌ర‌ఫున టెస్టుల్లో వేగంగా వంద వికెట్ల మైలురాయిని చేరుకున్న‌ జాబితాలో మాత్రం అసిత‌ ఫెర్నాండో.. మ‌రో స్పిన్న‌ర్ రంగ‌నా హెరాత్ (29 మ్యాచ్‌లు)తో క‌లిసి నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక లంక తరఫున టెస్టుల్లో వంద వికెట్ల మార్క్‌ దాటిన పదో బౌలర్‌గా, ఐదో ఫాస్ట్‌ బౌలర్‌గా అసిత ఫెర్నాండో నిలిచాడు.

లంక త‌ర‌ఫున వేగంగా 100 వికెట్ల మార్క్ అందుకున్న బౌల‌ర్లు
17 - ప్రబాత్ జయసూర్య
25 - దిల్‌రువాన్ పెరీరా
27 - ముత్తయ్య మురళీధరన్
29 - రంగనా హెరాత్, అసిత ఫెర్నాండో*
30 - లసిత్ మలింగ

2021లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అసిత ఫెర్నాండో అన‌తికాలంలోనే లంక ప్ర‌ధాన పేస‌ర్‌గా ఎదిగాడు. 2024లో 9 మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు ప‌డ‌గొట్టి బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసిన ఫెర్నాండో.. 29 మ్యాచ్‌ల్లో 48 ఇన్నింగ్స్‌ల్లో 3.48 ఎకాన‌మీ రేటుతో 100 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక జ‌ట్టు 27.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు చేసింది. క‌మిందు మెండిస్ (40), ధ‌నంజ‌య డిసిల్వా (22) క్రీజులో ఉన్నారు. పాక్ బౌల‌ర్ల‌లో స‌కీబ్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం లంక 320 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. అంత‌క‌ముందు పాకిస్తాన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల న‌ష్టానికి 434 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. సాద్ ష‌కీల్ (93) స‌హా ఐదుగురు పాక్ బ్యాట‌ర్లు అర్థ‌సెంచ‌రీల‌తో మెరిశారు.

 

ఇదీ చదవండి: కెప్టెన్‌గా ఫిక్స్‌!.. హింట్ ఇచ్చిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement