breaking news
Asitha Fernando
-
‘నా వికెట్ తీశావు.. సంబరాలు చేసుకో.. దూషిస్తే మాత్రం సహించను’
‘‘ఆరోజు జైసూ అవుట్ కాగానే నెమ్మదిగా డ్రెసింగ్ రూమ్ వైపు కదిలాడు. అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోసారి ఫుటేజీలో చూసినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అకస్మాత్తుగా జైస్వాల్ వెనక్కి తిరిగినట్లు కనిపిస్తుంది. ఆరోజు శ్రీలంక పేసర్ అసభ్య పదజాలంతో జైస్వాల్‌ను దూషించాడు.అతడు అదే పనిగా తనను దూషిస్తున్నట్లు జైస్వాల్‌తో నాతో చెప్పాడు’’ అని టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో రెచ్చగొట్టినందు వల్లే జైస్వాల్ స్పందించాల్సి వచ్చిందని తాజాగా స్పష్టం చేశాడు.తీవ్రస్థాయిలో వాగ్వాదం కాగా గత నెల (ఆగష్టు)లో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. అయితే, రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్- లంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదం జరిగింది.మరుసటి బంతికే క్లీన్బౌల్డ్టీమిండియా ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్ వేయగా.. అతడి బౌలింగ్‌లో జైస్వాల్ రెండు, నాలుగు, ఐదో బంతులకు ఫోర్లు బాదాడు. అయితే, ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు. దీంతో జైస్వాల్ మైదానం వీడుతున్న క్రమంలో.. అసిత ఏదో అన్నట్లు కనిపించింది.కొట్టుకునేదాకా వెళ్లారుఇందుకు జైసూ ఘాటుగానే బదులిస్తూ.. అసిత మీదకు దూసుకువెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కోపంగా తన హెల్మెట్‌తో నెట్టేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి జైస్వాల్, అసితలపై కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలు అతిక్రమించారన్న కారణంగా ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఇద్దరి ఖాతాలో చెరో డీ మెరిట్ పాయింట్ జతచేసింది.నా వికెట్ తీశావు.. కాబట్టి దూకుడుగా సంబరాలు చేసుకో.. కానీఈ విషయం గురించి తాజాగా ఆకాశ్ చోప్రా ఇంటర్వ్యూలో.. నాడు జైసూతో కలిసి మ్యాచ్ ఆడిన ధ్రువ్ జురెల్ స్పందించాడు. ఆరోజు జరిగిన ఘటనలో జైస్వాల్ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. ‘‘ఆరోజు జైస్వాల్ అవుటైన తర్వాత వెళ్లిపోతున్న సమయంలో అసిత రెచ్చగొట్టాడు.ఇందుకు బదులిస్తూ.. ‘నువ్వు నా వికెట్ తీశావు.. కాబట్టి దూకుడుగా సంబరాలు చేసుకో. కానీ నన్ను దూషించే హక్కు నీకు లేదు’ అని చెప్పాడు. అయినా జైస్వాల్ ఎప్పుడూ ఎవరినీ స్లెడ్జ్ చేయడు.ఎవరైనా తనను రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకోడు. వారి ప్రవర్తనకు తగ్గట్లే బదులిస్తాడు. క్రీజులో ఉన్నపుడు కేవలం బ్యాటింగ్ మీదే తన దృష్టి ఉంటుంది. కానీ ఎవరైనా ఇలా రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోడు’’ అని జురెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆసియా క్రీడలు- 2026: టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారు -
మీకేం తెలుసు?.. హద్దు మీరితే బాగోదు: జైస్వాల్ ఫైర్
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేకు టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా సరే హద్దులు మీరితే.. వారికి తాను తప్పకుండా బుద్ధి చెప్తానని స్పష్టం చేశాడు. అసలు జరిగింది ఏమిటంటే..కాగా టీమిండియా- శ్రీలంక మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా జైస్వాల్- అసిత ఫెర్నాండో మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్ వేయగా.. రెండు, నాలుగు, ఐదో బంతులకు జైస్వాల్ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు.కొట్టుకోవడమే మిగిలిందిఈ క్రమంలో జైస్వాల్ మైదానం వీడుతుండగా.. ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా అసిత ఏదో అన్నాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన జైసూ.. అతడి మీదకు వెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి కోపంగా చూసిన జైస్వాల్.. హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతోందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ వచ్చి ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.ఆటలో సహజమేఈ ఘటనపై ఇరుజట్ల కోచ్‌లు స్పందిస్తూ.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు సహజమేనని.. గేమ్‌ప్లాన్‌లో భాగంగానే కొన్నిసార్లు బౌలర్లు ఇలా రెచ్చగొడతారంటూ తేలికగా తీసిపడేశారు. ఇక ఈ విషయంపై హర్షా భోగ్లే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘అవుటైన తర్వాత జైస్వాల్ వెళ్లిపోతున్న సమయంలో అతడిని ఎవరో ఏదో అన్నారు.జైస్వాల్ ఏమీ అనకుండా వెళ్లాల్సిందినిజానికి బౌలర్లు సెండాఫ్ ఇవ్వడం నా దృష్టిలో అంత గొప్పేమీ కాదు. బౌలర్‌గా బ్యాటర్‌ను అవుట్ చేశామంటే అక్కడితో మీ పని పూర్తైనట్లు. అంతేగానీ.. ఇలాంటి చర్యలు అవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితిలో బ్యాటర్ ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే మంచిది. కానీ జైస్వాల్ తిరిగి వచ్చాడు.వాళ్లు ఏమన్నారో జైస్వాల్‌కు మాత్రమే తెలుసు. బౌలర్ అలా అనకుండా ఉండాల్సింది. కానీ జైస్వాల్ నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. జైస్వాల్ స్పందించాడు.మీకేం తెలుసు?.. తెలియకుండానే జడ్జిమెంట్లా?‘‘సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే.. ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని.. వాళ్లకు గట్టిగానే బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని జైస్వాల్ కామెంట్ సెక్షన్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
జైస్వాల్-అసిత ఘటనపై భారత బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-శ్రీలంక మధ్య కొలంబో టెస్టు తొలి రోజు ఆటలో చోటుచేసుకున్న యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. జైస్వాల్ బౌలర్‌కు అంత దగ్గరగా వెళ్లడం సరైంది కాదని, అయితే టెస్టు క్రికెట్లో తీవ్ర పోటీ మధ్య ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నాడు.తొలి రోజు ఉదయం సెషన్లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వేసిన ఓవర్లో జైస్వాల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే ఓవర్లో ఫెర్నాండో జైస్వాల్‌ను ఔట్ చేశాడు. అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో కలిసి ఫెర్నాండో సంబరాలు చేసుకుంటూ జైస్వాల్‌కు సెండ్ఆఫ్ ఇచ్చినట్లు కనిపించింది.దీంతో ఆగ్రహించిన జైస్వాల్ వెనక్కి తిరిగి ఫెర్నాండో వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఇద్దరూ ఎదురెదురుగా వచ్చి తలలతో ఢీకొట్టుకున్నారు. వెంటనే శ్రీలంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.ఈ ఘటనపై సితాన్షు కోటక్ మాట్లాడుతూ, “బౌలర్ ఏదో వ్యాఖ్య చేశాడని అనుకుంటున్నాను. అది ఉద్వేగభరిత పరిస్థితుల్లో జరిగింది. జైస్వాల్ అతడి దగ్గరకు అంతగా వెళ్లకూడదు. కానీ ఆ క్షణంలో అలా జరిగిపోయింది” అని చెప్పాడు.శ్రీలంక బౌలింగ్ కోచ్ రియాన్ వాన్ నీకెర్క్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. టెస్టు క్రికెట్లో భారత్ వంటి జట్టుతో ఆడుతున్నప్పుడు బౌలర్లు ఎప్పుడూ పోరాట స్ఫూర్తితో ఉండాలని, ఆటలోని తీవ్రమైన భావోద్వేగాలే ఇలాంటి మాటల మార్పిడికి కారణమవుతాయని పేర్కొన్నాడు.“ఇది కఠినమైన టెస్టు క్రికెట్. భారత్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు వెనక్కి తగ్గి కేవలం బంతులు వేయడం సాధ్యం కాదు. ఎప్పుడూ సవాలు విసురుతూ, ఏదో ఒకటి సృష్టించేందుకు ప్రయత్నించాలి. మాటల తూటాలు కూడా ఆ భావోద్వేగాల నుంచి వచ్చినవే” అని వాన్ నీకెర్క్ తెలిపాడు.అయితే కోచ్‌ల మాదిరిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఘటనను తేలికగా తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్లకు సెండ్ఆఫ్లు, అనుచిత ప్రవర్తనపై ఐసీసీ నిబంధనలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలనలో జైస్వాల్, ఫెర్నాండో మధ్య అనుచిత వ్యవహారం జరిగినట్లు తేలితే ఇద్దరిపైనా లేదా సంబంధిత ఆటగాడిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, కొలొంబో టెస్ట్ తొలి రోజు భారత బ్యాటర్లు పైచేయి సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (117) వరుసగా రెండో టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కగా.. శుభ్‌మన్ గిల్ (50), యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) రాణించారు. కేఎల్ రాహుల్ (18) నిరాశపర్చగా.. రిషబ్ పంత్ (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 300-5గా ఉంది. ధ్రువ్ జురెల్ (7), సరాన్ష్ జైన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! -
జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఔటైన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన జైస్వాల్ పెవిలియన్ వెళుతున్న సమయంలో లంక బౌలర్ తన మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కితిరిగి అసిత ఫెర్నాండోవైపు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో జైస్వాల్.. ఫెర్నాండో కళ్లలోకి చూస్తూ తన హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతుందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా జైస్వాల్‌ను పక్కకు తీసుకెళ్లి అక్కడి నుంచి పంపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జైస్వాల్ ఔటవ్వడానికి ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే ఫెర్నాండో తన మరుసటి బంతికే జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో లంక బౌలర్ కోపంతో పరిధి దాటి కామ్‌గా వెళుతున్న జైస్వాల్‌ను గెలికి మరి కయ్యం పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్‌లో జైస్వాల్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించాడు. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉండడం విశేషం. Body contact between Jaiswal and Asitha Fernando.. #SLVIND pic.twitter.com/w3Q905WUIf— Nibraz Ramzan (@nibraz88cricket) August 23, 2026 HEATED MOMENT BETWEEN JAISWAL & ASITHA 🤯 pic.twitter.com/SzgcNjYDUN— Johns. (@CricCrazyJohns) August 23, 2026Read: 95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం -
IND vs SL: భారత్ ఆలౌట్.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నామమాత్రంగా రాణించారు. ఫలితంగా టీమిండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధ శతకం (66)తో ఆకట్టుకున్నాడు.శ్రీలంక లక్ష్యం ఎంతంటే?మిగిలిన వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.తొలి ఇన్నింగ్స్ ఇలాఈ క్రమంలో గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో అలరించారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ 32, రిషభ్ పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది.భారీ ఆధిక్యంతో..అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. 284 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ కూల్చారు.భారత బౌలర్లు లంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయడంతో.. భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 35 పరుగులు చేయగలిగాడు. పడిక్కల్ (44), పంత్ (66)రాణించగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8), ధ్రువ్ జురెల్ (7), రవీంద్ర జడేజా (9), మానవ్ సుతార్ (9), కుల్దీప్ యాదవ్ (5), ప్రసిద్ కృష్ణ (2) సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు.Rishabh Pant walks back after a typically flamboyant half-century. 🚶➡️ Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/uBBiHTvsS8— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026శ్రీలంక బౌలర్లలో పేసర్ అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లాహిరు కుమార రెండు, కేశార నువాంత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన సీఏ


