టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే వాళ్లని ఇంకా దూషించడం కరెక్ట్ కాదని తెలిపింది. ఇప్పటికే కింద పడిపోయిన వాళ్లని తొక్కడం చాలా అమానుషమని పేర్కొంది. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా.. వాళ్లు కూడా ఒక మనిషేనని గుర్తించాలని కోరింది. వాళ్లు కూడా ఒకరి సంతానం..ఒక పేరెంట్ లేదా ఒకరి తోబుట్టువు అని మార్చిపోకూడదని హితవు పలికింది. మన ఇళ్లే బాగాలేనప్పుడు.. దయచేసి ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరొద్దని రేణు దేశాయ్ రాసుకొచ్చింది.
(ఇది చదవండి: 'సక్సెస్‌తో ఏం నేర్చుకోలేం'.. సమంత ఆసక్తికర కామెంట్స్)
మనమంతా మనుషులమని.. మనందరికీ సానుభూతి, దయ రెండు ప్రాథమిక అవసరాలని రేణు దేశాయ్ గుర్తు చేసింది. నా పోస్ట్ చూసి మీరు పిచ్చి రాతలు రాయవద్దని రేణు దేశాయ్ కోరింది. మనమంతా కలిసి మంచి సోసైటీ కోసం కృషి చేయాలని తెలిపింది. నాకు ఎలాంటి పేటీఎం డబ్బులు అందలేదని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొంది. ఇది కేవలం తన మనసులోని మాట మాత్రమేనని తెలిపింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారో క్లారిటీ లేదు.


