ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్కు కొదువ లేకుండా పోయింది. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. నేటి యువతను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
బాలీవుడ్లో వస్తోన్న సరికొత్త బోల్డ్, రొమాంటిక్ సిరీస్ టీన్ బిగడా. ఈ సిరీస్‌ను ముగ్గురు యువతీ, యువకుల జీవితం ఆధారంగా రూపొందించారు. ఒకరికీ మ్యూజిక్ అంటే పిచ్చి.. అలాగే మరొకరికి క్రికెట్ అంటే ప్రాణంగా జీవిస్తుంటారు. అలాంటి వీరి జీవితంలో అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ల లైఫ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఈ సిరీస్ స్టోరీ. కాగా.. ఈ సిరీస్‌లో ప్రసన్న బిష్త్ ప్రధాన పాత్రలో నటించారు.
Cricket ka passion, music ka junoon, par zindagi ne liya ek unexpected turn! #TeenTigada - Premiering on 20th November, only on Hindi Zee 5. #PrasannaBisht #DaneshRaizvi #RichaYamini #Streetlampentertainment #ScreamDreams #SarthakNakul https://t.co/B7AzkiZ6pT
— Zee 5 (@Zee5_Official) November 9, 2026


