రాజకీయాల్లోకి స్టార్‌ హీరో సూర్య..? ‘పాలిటిక్స్‌ అంటే ద్వేషం లేదు’ | Actor Suriya Politics Entry | Sakshi
Sakshi News home page

Suriya Politics Entry: ప్రస్తుతం రాజకీయాలన్నీ గమనిస్తున్నా: సూర్య

Nov 10 2026 4:55 PM | Updated on Nov 10 2026 5:03 PM

Actor Suriya Politics Entry

కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోలు రాజకీయాల్లోకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు విజయ్‌ దళపతి. మరోవైపు హీరో ధనుష్ కూడా పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి హీరో సూర్య పేరు కూడా వినిపిస్తోంది. అయితే వార్తలపై సూర్య తనదైన శైలిలో స్పందించారు.

‘నేను రాజకీయాల్లోకి రావడం లేదు. అలా అని రాజకీయాలంటే ద్వేషం లేదు. ప్రస్తుతం రాజకీయాలన్నీ గమనిస్తున్నా.. యువత రాజకీయాలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలి. రాజకీయ నాయకులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తి అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. ప్రస్తుతం నేను మాత్రం రాజకీయాల్లోకి రాను’ అని సూర్య క్లారిటీ ఇచ్చారు.

సినిమాల విషయానికి వస్తే.. 
సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ సీన్. ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 6న బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్క్ చేరుకుంది.

(ఇదీ చదవండి: నాగార్జునకి ఉన్న దమ్ము ఎవరికీ లేదు: రామ్‌ చరణ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement