కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది.. | Cargo Vessel Fire At China Shipyard | Sakshi
Sakshi News home page

కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది..

Sep 10 2026 5:11 PM | Updated on Sep 10 2026 5:27 PM

Cargo Vessel Fire At China Shipyard

బీజింగ్: తూర్పు చైనాలోని క్వింగ్‌డావోలోని షిప్‌యార్డులో మరమ్మతులు జరుగుతున్న కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. షిప్‌యార్డులో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఉదయం 11:15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

నౌకలో మొత్తం 42 మంది ఉండగా.. వారిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను సిబ్బంది అదుపులోకి వచ్చారు. లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్‌ మెలోడీ(Ocean Melody)నౌకలో ఈ  ఘటన జరిగింది. ఈ నౌక ఆగస్టు 31న క్వింగ్‌డావో షిప్‌యార్డుకు చేరుకుని.. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement