ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీల, సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ నిలిచారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పిలిచే నీతా ఈ వేడుక మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో మెరిసింది. పండుగ వైబ్స్‌ని తన డిజైనర్‌వేర్‌తో తెప్పించింది. ఆమె ప్రకాశవంతమైన ఫ్యూషియా పింక్ రంగు చీర ధరించారు. ఆమె కదిలిన ప్రతిసారీ ఆ శాటిన్ చీర కాంతిని ప్రతిబింబిస్తుంది.
ఆ చీరలో దాగున్న వివరాలే ఆ శారీని ప్రత్యేకంగా మార్చాయి. సున్నితమైన బంగారు లేస్‌వర్క్, అక్కడక్కడా ఉన్న స్వరోవ్‌స్కీ అలంకరణ ఈ చీరను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి. చెప్పాలంటే ఆ చీర పలు రకాల రంగుల షేడ్స్‌లో మెరుస్తూ అందరి చూపులను కట్టిపడేసింది. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ చాలా పలుచగా రంగురంగుల స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో సున్నితమైన గొలుసుల అలంకరణతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈ లుక్‌కి అనుగుణంగా పిచ్వాయి హ్యాండ్‌బ్యాగ్‌తో తళుక్కుమంది. దీనిపై ఎనామెల్ తామర పువ్వుల నమునాలు, వజ్రాల అంకరణలు, ముత్యాలు, జరీలైనింగ్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. ఇది వారసత్వం,నైపుణ్యంతో కలగలిసిన అద్భుత ఫ్యాషన్. ఈ చీర హైలెట్‌గా కనిపించేలా చిన్న బొట్టు, స్టేట్‌మెంట్ చెవిపోగులు, ఇయర్ కఫ్స్, ఉంగరాలతో తన ఆహార్యాన్ని పూర్తి చేసిందామె. చెప్పాలంటే సంప్రదాయ లుక్‌కి స్టైల్ టచ్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది నీతా.
ఇదీ చదవండి: వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకలో త్రిష సందడి..లేత గులాబీ చీరలో బుట్టబొమ్మలా


