మార్చిలోగా పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మార్చిలోగా పనులు పూర్తి చేయాలి

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : అమృత్‌ భారత్‌ స్టేషన్ల నిర్మాణంలో భాగంగా కడప రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను 2027 మార్చిలోగా పూర్తి చేయాలని గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కడప రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆయన పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాల్లో కలియ తిరిగి ప్రస్తుతం జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. వెయిటింగ్‌ హాలు, బుకింగ్‌ ఆఫీసు, ఫుడ్‌కోర్టు, లిఫ్ట్‌, ఎస్కలేటర్‌, టాయిలెట్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, పార్శిల్‌ కార్యాలయం, పార్కింగ్‌ఏరియాను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం రైల్వే అధికారులకు ప్రయాణీకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డీసీఎం సత్యనారాయణ, స్టేషన్‌ మేనేజర్‌ ఎల్వీ మోన్‌రెడ్డి, అధికారులు జనర్దాన్‌, దుర్గారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మల్లయ్యకొండకు

ప్రత్యేక బస్సులు

మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్‌ నుంచి సాయంత్రం వరకు షటిల్‌ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement