రెడ్డెమ్మా.. దీవించమ్మా.. | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మా.. దీవించమ్మా..

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. సంతానాన్ని ప్రసాదించే తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేశారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

సాక్షి, మదనపల్లె : జిల్లాలో విద్యుత్‌ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు కార్యక్రమం జరగుతుందన్నారు. 9440817449 నెంబరు ఫోన్‌ చేసి విద్యుత్‌ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. కిందిస్థాయిల్లో పరిష్కారంకాకపోతేనే ప్రజలు కలెక్టరేట్‌ వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.

జిల్లా అంతటా వర్షాలు

సాక్షి, మదనపల్లె : వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలు, ఉక్కపోత మధ్య అల్లాడిపోతున్న జిల్లా ప్రజానీకానికి శనివారం రాత్రి కురిసిన వర్షం ఊరటనిచ్చింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. పెద్దమండ్యం మండలంలో అత్యల్పంగా 1.4 మిల్లీమీటర్లు, నిమ్మనపల్లిలో అత్యధికంగా 83.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలు. గాలివీడులో 4.8, చిన్నమండెంలో 5.0, సంబేపల్లిలో 22.4, రాయచోటిలో 6.8, లక్కిరెడ్డిపల్లి లో 10.4, రామాపురంలో 9.0, ములకలచెరువులో 15.0, తంబళ్లపల్లెలో 8.4, కురబలకోటలో 15.2, పెద్దతిప్ప సముద్రంలో 15.6, బి.కొత్తకోటలో 63.4, మదనపల్లెలో 55.4, చౌడేపల్లెలో 50.2, రామసముద్రంలో 49.6, పుంగనూరులో 32.0, గుర్రంకొండలో 19.8, కలకడలో 18.8, కె.వి.పల్లిలో 36.2, పీలేరులో 57.4, కలిగిరిలో 67.6, వాల్మీకిపురంలో 38.6, సదుంలో 24.4, సోమలలో 58.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

మతసామరస్యాలకు ప్రతీక గణేష్‌ ఉత్సవం

రాయచోటి : రాయచోటిలో మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్‌ ఉత్సవాలు సాగుతున్నాయి. విగ్రహాల వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ముస్లింలు కూడా పాల్గొనడం విశేషం. అన్నదాన కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా తమవంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూవేలం పాటలో కూడా ముస్లిం సోదరులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మాసాపేట వరిగమార్గంలోని పూలుకుంట రెడ్డన్న ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహం వద్ద బీసీ సంఘం నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంటు దుర్గం షబ్బీర్‌ వినాయక లడ్డూను ఒక లక్ష, పదివేల, నూటా పదహారు రూపాయలకు దక్కించుకున్నారు. కుటుంబ సమేతంగా గణేష్‌ ఉత్సవాల సంప్రదాయ పద్ధతిలో లడ్డూ ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్థానిక గణేష్‌ మండపం నిర్వహకులు ఆదివారం బాణసంచ పేలుస్తూ మంగళ వాయిద్యాలతో షబ్బీర్‌ ఇంటివరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దుర్గం షబ్బీర్‌ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement