జిల్లా నుంచి నేరుగా నెల్లూరు రైల్‌కనెక్టివిటీ అవసరం. ఇప్పటి వరకు నెల్లూరుకు వెళ్లాలంటే బస్సు ప్రయాణమే దిక్కు. కడప, నందలూరు, రాజంపేట, ఎర్రగుంట్ల, ముద్దనూరు వాసలు నెల్లూరుకు వెళ్లేందుకు రైలుమార్గం లేదు. కృష్ణపట్నం లైన్‌లో నెల్లూరు వెళ్లేందుకు ఇప్పటి దాకా ప్యాసింజర్‌రైలు నడపలేదు.రాజంపేట–నెల్లూరు రైల్వేలైన్ ఏర్పాటు ఆమోదయోగ్యమైనది. జిల్లావాసులు కోస్తా పోయేందుకు కనెక్టివిటీ బాగుంటుంది. అందువల్ల కొత్తరైల్వేలైన్ నిర్మితం చేయాలి. ఆ దిశగా ప్రయత్నిస్తాను. –పీవీ మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ


