పచ్చనేతలకు కడుపుమంట! | - | Sakshi
Sakshi News home page

పచ్చనేతలకు కడుపుమంట!

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

వైఎస్‌ కుటుంబంపై పులివెందులప్రజానీకం దశాబ్దాలుగా అభిమాన వర్షం కురిపిస్తోంది.. ఆ కుటుంబమూ అంతే.. ఎన్నడూ చూడని అభివృద్ధిని పులివెందుల ముంగిటకు తీసుకొచ్చింది. ఈ అభిమానం చూడలేక.. పులివెందుల ప్రగతిని జీర్ణించుకోలేక పచ్చనేతలకు కన్నుకుట్టింది. ఫలితంగా కుట్రలకు బీజం వేసింది. కడుపు‘మంట’తో విధ్వంసరచనకు ఒడిగట్టింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిందో లేదో ఖాకీని తోడుగా చేసుకుని ఇదిగో ఇలా అడుగడుగునా ‘అగ్గి’రాజేస్తోంది. ఇది చూసిన స్థానిక ప్రజానీకం‘సిగ్గుందా...’ అని నిలదీస్తోంది. ‘ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న మీకు ఓటేయాలా ’ అంటూ ప్రశ్నిస్తోంది. – పులివెందుల

టీడీపీ గూండాల చేతిలో దహనమైన కారు (ఫైల్‌)

పులివెందులలో ఇటీవల చికెన్‌ షాపుకునిప్పు పెట్టిన టీడీపీ గూండాలు (ఫైల్‌ఫొటో)

టీడీపీ అల్లరి మూకల చేతిలో దగ్ధమైన బైకులు (ఫైల్‌)

ఓటమి భయంతోనే కూటమి అరాచకాలు

ఓటమి భయంతోనే కూటమి అరాచకాలు సాగిస్తోంది. పది రోజులుగా షాపులు, బైకులు, ట్రక్కులతోపాటు లారీలను టీడీపీ గుండాలు, అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసేవారు ఎవరైనా నామినేషన్‌ వేయిస్తారని, రాజకీయం చేతకాని వారే ఇలా కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేస్తూ అరాచకాలు సృష్టిస్తారు. – వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement