ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులుగా మేరువ ఓబయ్య యాదవ్, మచ్చా మధులు శుక్రవారం కడప జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. అనంతరం సాయంత్రం వీరు తిరిగి వస్తుండగా చెన్నూరు సమీపంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బచ్చల వీరప్రతాప్తోపాటు ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం లక్ష్మణ్, మరి కొంత మంది కిడ్నాప్ చేశారు. కొంత దూరం తర్వాత జెడ్పీటీసీ అభ్యర్థులను కారులో నుంచి దించేసి.. ఓబయ్య యాదవ్ ప్రతిపాదకుడు రెడ్డి రాముడు, మధు ప్రతిపాదకుడు పోట్లదుర్తి వెంకటరాముడును తీసుకెళ్లారు. చెన్నూరు మండలానికి సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకుడు నిరంజన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. శుక్రవారం రాత్రి పోలీసులు విడిపించి వారిని ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి రాముడు భార్య ప్రియ, పోట్లదుర్తి వెంకటరాముడు భార్య సునీతను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఫ్యామిలీ ఫొటోలు తీసుకున్నారు. మీ భర్తలను మీకు అప్పగించామని పోలీసులు చెప్పారు. పోలీస్‌స్టేషన్ నుంచే టీడీపీ నాయకులు, కిడ్నాపర్లు.. వీరిని మళ్లీ తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరణ కోసమే వీరిని తీసుకెళ్లిన టీడీపీ నాయకులు బెదిరించి, భయపెట్టి హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పోటీ నుంచి తప్పించేందుకే కిడ్నాప్ చేశారు
వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా శుక్రవారం కడపలో నామినేషన్ వేశాను. చెన్నూరు దగ్గర మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మమ్మల్ని వదిలేసిన తర్వాత ప్రతిపాదకుడిని తీసుకెళ్లారు. ఊహించని ఈ సంఘటనతో ఆందోళన చెందాం.
– మచ్చా మధు, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి
కిడ్నాపర్లకే మళ్లీ అప్పగించిన పోలీసులు


