కడప బాలోత్సవం వాయిదా | - | Sakshi
Sakshi News home page

కడప బాలోత్సవం వాయిదా

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

కడప ఎడ్యుకేషన్‌ : ఈ నెల 31, నవంబర్‌ 1వ తేదీన జరగాల్సిన కడప బాలోత్సవం 4వ పిల్లల పండుగ ఎన్నికల కారణంగా ఉన్నతాధికారుల సలహా మేరకు వాయిదా వేస్తున్నామని కడప బాలోత్సవ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగమునిరెడ్డి, రాజశేఖర్‌ రాహుల్‌ చెప్పారు. కడపలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల షెడ్యూలు, విద్యార్థుల పరీక్షలు, ఉపాధ్యాయుల ఎన్నికల విధులు పరిగణన లోనికి తీసుకొని ఉన్నతాధికారుల సలహాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా వాయిదా వేయుటకు నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త తేదీలు ఎన్నికల తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు తదుపరి తేది ప్రకటించే వరకు కొనసాగుతుందని తెలియజేశారు.

ఈ సమావేశంలో గౌరవ సలహాదారులు, కళాశాల ప్రిన్సిపాల్‌ వీర సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ మృత్యుంజయరావు, డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి, సత్తార్‌ ఫైజీ, కార్యదర్శులు లక్ష్మిరాజ, ఎల్లేశ్వర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, మక్బూల్‌బాషా, కోశాధికారి సునీత, ఆహ్వాన సంఘం సభ్యులు తిరుపాలు, పెన్షన్‌ రామమూర్తి నాయుడు, వరదా రెడ్డి, వెంకటేశ్వరాచారి, శ్రీనివాసులురెడ్డి, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, శివకృష్ణారెడ్డి, రామసుబ్బమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement