కొత్త పింఛన్‌... ఎప్పుడో ! | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్‌... ఎప్పుడో !

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

కొత్త పింఛన్‌... ఎప్పుడో !

జిల్లాలో కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు

కడప రూరల్‌: వృద్ధాప్యంతో వణుకుతున్న చేతులు....భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిన జీవితాలు... రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయిన అడుగులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య, వితంతు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలామంది నిరుపేదల దీన గాథ ఇది.. రెండేళ్లకు పైగా పండుటాకులు, అభాగ్యులు పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో గత నెలలో హడావుడిగా పింఛన్‌ పోర్టల్‌ తెరిచిన ప్రభుత్వం.. కొద్ది రోజులుకే మూసేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.. కొత్త పింఛన్‌కు సంబంధించిన జీవో ఇంతవరకు రాలేదు.. ఈ నెల 1వ తేదీ పింఛన్‌ వస్తుందని ఆశగా సచివాలయాలకు వెళ్లిన పండుటాకులు.. పింఛన్‌ రాలేదనే సరికి నిరాశగా వెనుదిరిగారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పెన్షన్‌ అర్హత వచ్చిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెల నుంచి వయసు నిండిన వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు నెల తిరగకుండానే లబ్ధిదారులుగా జాబితాలో చేరేవారు. సంక్షేమాన్ని నిరంతర ప్రక్రియగా నడిపించారు.

అర్హులు‘పోర్టల్‌’కే పరిమితం...

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నరేళ్లవుతోంది. కనికరం లేని ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయలేదు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అభాగ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం వచ్చింది. ఇది గమనించిన పాలక ప్రభుత్వం ఓట్ల కోసం అవ్వ తాతలపై ప్రేమ ఒలకబోసింది. కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించింది . ఆ మేరకు కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 18వ తేదీ నాటికి ముగిసింది. అనంతరం సచివాలయాల వెల్ఫేర్‌ సిబ్బంది వెరిఫికేషన్‌ చేసి తమ లాగిన్‌ ద్వారా ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల లాగిన్‌ లకు పంపారు. ఈ వివరాలను అమరావతి లోని ‘సెర్ఫ్‌’కు పంపితే, అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కాగా సెప్టెంబర్‌ 26వ తేదీ నాటికి పింఛన్‌ పోర్టల్‌ ను మూసివేయడం గమనార్హం.

ఏం జరుగుతుందో... !

కొత్త పింఛన్‌కు జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ, చర్మకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత, మత్స్యకారులు, చేనేత కేటగిరి కి చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్‌ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. తీరా చూస్తే ఆ ఊసే లేకపోవడంతో నిరాశ చెందారు. అధికారులను అడిగితే ఒకటే మాట ‘మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. కొత్త పింఛన్‌ మంజూరు కాలేదు...’ అనే సమాధానం చెప్పారు.

‘పచ్చ’పింఛన్‌ లా మార్చాలని...?

ఈ ప్రభుత్వం అర్హులకు పథకాలు దక్కకుండా చేస్తోంది. ప్రతి ఒక్కటి తమ పార్టీ కార్యకర్తలకే దక్కేలా చూస్తోంది. అందులో భాగంగానే కొత్తగా ఇచ్చే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ లు తమ పార్టీకి చెందిన వారికి దక్కడానికి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ‘సిక్స్‌ స్టెప్‌’ ‘వడపోతతో పాటే’

‘సెవెంత్‌ స్టెప్‌’ వేసి అంటే తమ పార్టీకి చెందిన వారికి కొత్త పింఛన్‌ వచ్చేలా టీడీపీనేతలు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నియోజకవర్గం వచ్చిన పెండింగ్‌ అర్హులు తిరస్కరించినవి

దరఖాస్తులు

కడప 7,386 3,283 3,938 165

బద్వేలు 7,381 48 6.678 655

జమ్మలమడుగు 8,049 57 7,121 871

కమలాపురం 6,203 196 5,589 418

మైదుకూరు 6,795 167 6,035 593

ప్రొద్దుటూరు 6,789 11 5,761 1,017

పులివెందుల 7,076 73 6,121 882

రాజంపేట 8,059 75 7,062 922

మొత్తం 57,738 3,910 48,305 5,523

దరఖాస్తు గడువు ముగిసింది..

వెరిఫికేషన్‌ పూర్తయింది

విడుదల కాని జీఓ.. చేతికందని పింఛన్‌

ఎన్నికలవేళ కూటమి ప్రభుత్వం’కుట్ర

జిల్లాలో కొత్త పింఛన్‌కు మొత్తం 57,738 మంది దరఖాస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement