నిరుద్యోగ భృతి ఇంత వరకు ఇవ్వలేదు కాని సోషల్ మీడియాలో ఇన్‌ప్లుయెన్సర్లకు వేతనాలు ఇస్తా రా? నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు. గ్రామ వలంటీర్లకు రూ.5 వేలు వేతనం ఇవ్వడమే దండగ అని గగ్గోలు పెట్టి ఆ వ్యవస్థనే తీసేసి వారిని నిరుద్యోగులుగా మార్చారు. ఇప్పుడేమో ప్రభుత్వానికి డప్పు కొట్టే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లకు భారీ వేతనాలు ఇవ్వడం దారుణం. ఇదంతా కూటమి సోషల్ మీడియా బ్యాచ్‌కు లబ్ధి కూర్చే ప్రయత్నం తప్ప ఇంకేమి లేదు. ఈ నిర్ణియాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
– శివరామ్, మాజీ వలంటీర్,
సంబేపల్లె మండలం


