గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

● నేడు 629 పంచాయతీల్లో గ్రామ సభలు ● కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామాల అవసరాలను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి, 2027–28 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామస్థాయిలోనే గుర్తించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజలు, కూలీలు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు అవసరమైన పనులను సూచించాలని కలెక్టర్‌ కోరారు. గ్రామాల సమగ్ర అభివద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

ప్రొద్దుటూరు : జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో గురువారం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, జేసీ నిధిమీనాతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం వేదిక, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత ఏర్పాట్లను సమన్వ యంతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిమారు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతమయ్యేలా అధికారులు పనిచేయాలని తెలిపారు. షేక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీఎస్‌ ముక్తియార్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులు బహిరంగ సభ ప్రదేశం, హెలిప్యాడ్‌ ప్రాంతాలను పరిశీంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement