4న జిల్లాస్థాయి ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

4న జిల్లాస్థాయి ఎంపికలు

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఈనెల 4న అండర్‌–19 షూటింగ్‌, ఫెన్సింగ్‌ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 జిల్లా సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లాలోని ప్రొద్దుటూరు జార్జి కారోనేషన్‌ క్లబ్‌లో ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటల కల్లా హాజరుకావాలని కోరారు.

జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక

కమలాపురం : జిల్లా స్థాయి అసోసియేషన్‌ (జూనియర్స్‌) కబడ్డీ జట్టును గురువారం స్థానిక జడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌ ప్లే గ్రౌండ్‌లో ఎంపిక చేశారు. జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల తదితర మండలాల నుంచి బాల బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురు శేఖర్‌, క్రీడాకా రులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏపీ పీడీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ కిరణ్‌ , కబడ్డీ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ఓ. రవీంద్రారెడ్డి, కమలాపురం జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం కాజా ప్రవీణ కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ప్రతి క్రీడాకారుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి తోడ్పడాలని సూచించారు.

ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

స్థానిక బాయ్స్‌ హైస్కూల్‌లో రెండో రోజు ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. పరుగు పందెం (100మీ., 200 మీ.), లాంగ్‌ జంప్‌, హైజంప్‌, డిస్కస్‌ త్రో, షాట్‌ పుట్‌ తదితర పోటీలు నిర్వహించి అన్ని ఈవెంట్లలో మండల స్థాయి విజేతలకు ఎంపిక చేశారు.అంతకుముందు ఎంఈఓలు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

కడప మీదుగాసికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

కడప కోటిరెడ్డి సర్కిల్‌: తిరుపతి... సికింద్రాబాద్‌ మధ్య కడప మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. ఈ రైలు ఆదివా రం సాయంత్రం 4.30కి తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్‌, వికారాబాద్‌ మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు 7 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి ఇదే రైలు (07422) సోమవారం సాయంత్రం 4.15 కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 6.45కు తిరుపతికి చేరుకుంటుందని జనార్దన్‌ తెలిపారు.

9 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన 9 మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను ఆరు నెలల పాటు రద్దు చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ వీర్రాజు తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రమాదకరంగా వాహనాలు నడిపినందుకు ఆర్నెళ్ల పాటు లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు.ఇందులో కళ్యాణ్‌బాబు, డి. తేజ్‌దీప్‌, చేరెడ్డి మారుతి శివ ప్రసాద్‌రెడ్డి, గజ్జల లక్ష్మీ దీపక్‌ రెడ్డి, బి. వినయ్‌కుమార్‌రెడ్డి, కిన్నెర లోకేష్‌, ఖాదరబాద్‌ పవన్‌కుమార్‌, వినయ్‌కుమార్‌ రెడ్డి, వీరంపెద్ది ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోను వాహనాలను నడపరాదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.

మదనపల్లెకు నేడు సీఎం, కేంద్ర మంత్రి రాక

సాక్షి, మదనపల్లె: మదనపల్లెలో ఏర్పాటు చేసిన రాయలసీమ హార్టికల్చర్‌ హాబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌ హాజరుకానున్నా రు. అలాగే బీకేపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరి రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మదనపల్లె మండలంలోని కొండామర్రిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ , సభా వేదికను మంత్రులు బీసీ జనార్ధన్‌ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

మదనపల్లె టౌన్‌: ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలి పారు. హెలీపాడ్‌, సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement