నూతన స్టాట్యూటరీ అధికారుల నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన స్టాట్యూటరీ అధికారుల నియామకం

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో వివిధ విద్యా, పరిపాలన, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన స్టాట్యూటరీ అధికారులను నియమించినట్లు డైరెక్టర్‌ విజయ ప్రకాష్‌ పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.రత్నకుమారి, డీన్‌ ఆఫ్‌ అకాడమిక్స్‌గా ఎంఎంఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహబూబ్‌ జిలాని, బాలుర డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌గా ఫిజికల్‌ డైరెక్టర్‌ పి.వెంకట రమణారెడ్డి, బాలికల డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌గా ఫిజిక్స్‌ లెక్చరర్‌ బి.దీపిక బాలను నియమించినట్లు తెలిపారు. గురువారం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.విజయ ప్రకాష్‌ నూతనంగా నియమితులైన స్టాట్యూటరీ అధికారులకు నియామక ఉత్తర్వుల ప్రతులను అధికారికంగా అందజేశారు. అదే విధంగా, బాధ్యతల నుంచి రిలీవ్‌ అవుతున్న స్టాట్యూటరీ అధికారులైన అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డా.పెనుగొండ రవి కుమార్‌, డీన్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ డౌండ్కర్‌ రమేష్‌ కై లాస్‌, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డా.జి.వెంకటేష్‌ అందించిన సేవలను డైరెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement