వందశాతం మించి సాగైన పంటల వివరాలు.. (హెక్టార్లలో)
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వర్షపాత వివరాలు...
63.3 శాతం మేర పంటలసాగు..
● జిల్లావ్యాప్తంగా 63.3 శాతానికే
పరిమితమైన పంటలసాగు
● నిరాశే మిగిల్చిన సీజన్
● ఇటీవల కురిసిన వర్షంతో 7982 హెక్టార్లలో పెరిగిన సాగు విస్తీర్ణం
కడప అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ నిరాశజనకంగా ముగిసింది. తీవ్ర వర్షాభావానికి పాలకుల నిర్లక్ష్యం తోడై పంట ముందుకు ‘సాగ’లేదు. చివరికి మూడు కష్టాలు.. ఆరు నష్టాలుగానే మిగిలింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో వందశాతం సాగుకాకుండానే ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాధారణసాగు 76,496 హెక్టార్లు ఉండగా సెప్టెంబర్ 30వ తేదీ తేదీకి 48,431 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ సాగుకంటే 28065 హెక్టార్లలో పంటల సాగు తగ్గింది. ఇందులో మొక్కజొన్న, రాగి పంటలు మాత్రం వందశాతానికి మించి సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న 131.4 శాతం సాగుకాగా రాగి రెండు వందల శాతం పైగా సాగైంది. మిగతా ఏ పంట వంద శాతానికి చేరువ కాలేదు.
పది రోజుల్లో పెరిగిన సాగు విస్తీర్ణం...
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మాదిరిగా వర్షాలు పడ్డాయి. దీంతో ఈ పది రోజుల్లోనే జిల్లాలో 7982 హెక్టార్ల వరితోపాటు వివిధ పంటలసాగు పెరిగింది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 40,449 హె క్టార్లలో పంటలు సాగు కాగా ఈ వర్షం వచ్చాక 48,431 హెక్టార్లకు సాగు పెరిగింది.
పంటపేరు సాధారణ సాగైన సాగు
సాగు విస్తీర్ణం శాతం
రాగి పంట 08 16 200.00
మొక్కజొన్న 1495 1964 131.4
75 శాతం మించి సాగైన పంటల వివరాలు...
మినుము 3745 3676 98.2
వేరుశనగ 4446 4004 90.1
50 శాతం మించి సాగైన పంటల వివరాలు..
వరి 33,078 23,636 71.46
ఉలవలు 19 13 68.4
ెపెసలు 113 61 68.4
ఆవుగడ్డి 76 49 64.5
సజ్జలు 994 590 59.4
చెరకు 75 39 52.0
నెల సాధారణ కురిసిన లోటు
వర్షపాతం వర్షపాతం వర్షపాతం
జూన్ 68.2 50.3 –26.3
జులై 96.7 24.5 –74.7
ఆగష్టు 118.4 66.7 – 43.7
సెప్టెంబర్ 117.2 88.3 – 24.7
మొత్తం 400.5 229.8 – 42.6
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి నుంచే ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర జిల్లాలో వర్షాలు కురవలేదు. దీంతోపాటు జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలన్నీ కూడా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో పంటలసాగు బాగా వెనకబడింది. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతోపాటు బోర్లు, కేసీ కెనాల్‌కు కొద్ది రోజులు నీరు రావడంతో సాగు కొంత పెరిగింది. ఇప్పటి వరకు 63.3 శాతంగా పంటలసాగు నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
– సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి


