ఆకాంక్ష జిల్లాల పురోగతిలో కడపకు అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ఆకాంక్ష జిల్లాల పురోగతిలో కడపకు అగ్రస్థానం

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

కడప సిటీ: ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధిస్తూ, జాతీయ స్థాయిలో వరుసగా మూడు త్రైమాసికాల్లో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఆకాంక్ష జిల్లాలు, బ్లాకుల అభివృద్ధి పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌తో పాటు నీతీ ఆయోగ్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి కార్తీక్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో నీతీ ఆయోగ్‌ నిర్దేశించిన వివిధ ప్రామాణికాల్లో సాధించిన ప్రగతిని మరియు అభివృద్ధి పురోగతిని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement