కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి పోరాటం స్ఫూర్తిదాయకమని సీపీఎం సీనియర్ నాయకుడు కందారపు మురళి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర వాసి అయిన సీతారాం ఏచూరి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, బి.మనోహర్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, బి.దస్తగిరిరెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


