మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు పొడిగింపు

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లాలోని 160 మద్యం దుకాణాల లైసెన్స్‌ను రెన్యువల్‌ చేస్తూ ఏడాది పాటు గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జె.రమేష్‌ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు ఈనెల 30 తేదీకి ముగుస్తుండడంతో వాటిని అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు రెన్యూవల్‌ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్‌ మద్యం దుకాణాలకు రెన్యూవల్‌ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్‌ రూమ్‌ ఫీజు రూ.7.50 లక్షలు, గీత కులాల మద్యం దుకాణాలకు రెన్యూవల్‌ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్‌ రూమ్‌ ఫీజు రూ.5 లక్షలు తమ వెబ్‌సైట్‌లో చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో భర్తీ కాని 14 మద్యం దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. ఇందులో మైదుకూరు –2, ముద్దనూరు–1, కడప–2, సిద్దవటం –2, పులివెందుల –1, ఎర్రగుంట్ల–1, జమ్మలమడుగు–2 ఉన్నాయని వివరించారు.

అంకెల గారడీతో ప్రజలను మభ్య పెడుతున్న సీఎం

కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

కడప రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్త మాటలు, అంకెల గారడీతో మభ్యపెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ అన్నారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ ప్రెస్‌ క్లబ్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అప్పులు, వడ్డీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని అన్నారు. ఉత్త మాటలు, అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారని తెలిపారు. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కిలో బియ్యం రూ 70 దాటిందన్నారు. వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులు, ఉప్పు, పప్పు, నూనె, కోడి గుడ్డు మొదలుకొని అన్ని ధరలు పెరిగాయని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయం పెరగక, ఆర్థిక భారంతో చితికి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు నేపథ్యంలో అన్నదాతలు, ప్రజలను ఆదుకోవాలని అన్నారు. ప్రధాన మంత్రి మోడీకి రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదన్నారు. ఆయన రాజ్యా ంగం చదవలేదన్నారు. ప్రధానమంత్రి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సూచనలకు విరుద్ధంగా ఉత్తర భారతదేశానికి 500 సీట్లు, దక్షిణ భారతదేశానికి 300 సీట్లులోపు ఇవ్వాలని అనుకుంటున్నారని, అదే జరిగితే అసమానతల కారణంగా దేశం ఆరు ముక్కలవుతుందని హెచ్చరించారు.

వినాయక చవితి

రోజున గ్రీవెన్స్‌ రద్దు

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కనుబిల్లి

మదనపల్లె టౌన్‌: వినాయక చవితి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ఉన్నందున ఆ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుల కోసం ప్రజలు ఎవరూ ఎస్పీ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు. వచ్చే వారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement