కడప అర్బన్: వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఈనెల 15వ తేదీన విజయవాడలోని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఛాంబర్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ఆదేశించారు. ఒక కీలకమైన భూ వివాదం కేసులో కడప నగరానికి చెందిన పి.సరోజమ్మ, పి.కిషోర్‌కుమార్‌ల ద్వారా అందిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. కలెక్టర్, ఎస్పీలతో పాటు కడప డివిజన్ డీఎస్పీ, కమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్, వల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్, కడప రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, వల్లూరు తహసీల్దార్‌లను సైతం వ్యక్తిగతంగా చైర్మన్ ముందు హాజరుకావాలని ఏపీ ఎస్సీ కమిషన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం, అధికారిక నివేదికలతో సంబంధిత అధికారులంతా విచారణకు రావాలని చైర్మన్ స్పష్టం చేశారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
జిల్లా కలెక్టర్
శ్రీధర్ చెరుకూరి


