వైఎస్సార్‌సీపీ కార్యర్తలే లక్ష్యంగా బైండోవర్లు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యర్తలే లక్ష్యంగా బైండోవర్లు

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

జమ్మలమడుగు : రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీలో బాగా పనిచేస్తున్న కార్యకర్తలపై బైండోవర్లు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది సరికాదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. ఈమేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేకున్నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి అవమానిస్తున్నారన్నారు. పోలీసులు పక్షపాత వైఖరి వీడాలన్నారు. బైండోవర్‌ కేసులు క్రిమినల్‌ కేసులు ఉన్నవారిపై పెట్టాలన్నారు. కానీ మాజీ సర్పంచ్‌లపై కూడా పెట్టి రాబోయే ఎన్నికల్లో వారిని పాల్గొనకుండా పోలీసులు భయందోళనకు గురి చేయడం ప్రజా స్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. ఇదేవిషయాన్ని ఇప్పుడు డీఎస్పీకి వివరించామని, జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు. బైండోవర్లు ఇరువర్గాలపై పెట్టాలే తప్ప కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మాత్రమే పెట్టడం అన్యాయం అని అన్నారు. కూటమి నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలడతాం.. మీ వైఫల్యాలను ప్రజలకు వివరించి వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటామ అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, పొన్నపురెడ్డి వెంటకశివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లక్షుమయ్య, మైనార్టీ నాయకులు ముల్లాజానీ, రైతు నాయకుడు విశ్వనాథ్‌రెడ్డి,వేణు యాదవ్‌, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, యేబు, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సెక్రెటరీ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం

సరికాదు : ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement