విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్‌లో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం కుటుంబ సభ్యులను ఎంతగానో కలచివేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ఆశించిన మార్కులు రాలేదని కొందరు విద్యార్థులు తీవ్రంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి, భవిష్యత్తుపై భయం వంటి అంశాలు వారిని మానసికంగా వేధిస్తున్నాయి. కానీ ఒక పరీక్షలో ఫెయిల్ కావడం అంటే.. జీవితంలో ఫెయినట్లు కాదు. ఒక సంవత్సరం నష్టం కావచ్చు. ఒక అవకాశం చేజారవచ్చు. కానీ జీవితం మాత్రం ఒక్కటే. అందుకే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యను తల్లిదండ్రులు ఓపికగా వినాల్సిన అవసరం ఉంది.


