నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కన్యకా చెరువు వైపు దూసుకెళ్లింది.ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటనపై ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ చిట్వేల్‌కి చెందిన చల్ల జయకర్ రాజంపేట నుంచి కడపకు కారులో వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన కారు చెరువుకట్టపై ఉన్న ఇనుప డివైడర్లను ఢీ కొట్టి చెరువు దిగువ ప్రాంతం వైపు దూసుకెళ్లిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇరువురు బుకీలను ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో హుస్సేన్, సురేష్ రెడ్డి–99 యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్‌ఐ మైనుద్ధిన్ సిబ్బదితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 20 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


