గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

కడప సిటీ : పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సహిత, ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణంలో శాంతియుత ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ తోపాటు జిల్లా ఎస్పీ.షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, జేసీ డా. నిధీమీనా, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌.ఎస్‌. భావన, ఏఎస్పీ విభూకృష్ణ, డీఆర్వో మల్లికార్జునుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో గణేశ చతుర్థి ఉత్సవాలను నిర్వహించుకుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. అందు కోసం అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.

మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల ప్రజల సహకారంతో గణేష్‌ ఉత్సవాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంట్‌ తీగలు, కేబుల్‌ వైర్‌ లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అలాగే.. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వలన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు, శాంతిభద్రతలకు, మతసామరస్యానికి ఇబ్బంది కలగకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రాంతాల, వీధుల వారీగా ఏర్పాటు చేస్తున్న ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ముందస్తుగా.. స్థానిక సి.హెచ్‌.ఓ. ల వద్ద అనుమతులు పొందాలన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని డీజే సౌండ్‌ పొల్యూషన్‌ లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవాల నిర్వహణలో శాంతి భద్రతల ఏర్పాట్లపై.. పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్‌ స్వీకరించారు.

ప్రజల్లో నమ్మకాన్ని పెంచండి

కడప సిటీ : ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతోపాటు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ‘ఎల్‌నినో‘ వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు, సాగు విధానాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభాభవన్‌ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి జేసీ డాక్టర్‌ నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, డీసీవో వెంకట సుబ్బయ్య, డిప్యూటీ కలెక్టర్లు జాన్‌ ఇర్విన్‌, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement