కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప ఆర్టీసీ బస్టాండులో రిజర్వేషన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు కౌంటర్‌కు వచ్చి వెనుదిరిగి వెళుతున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ రిజర్వేషన్ సేవలు కొనసాగించిన గౌస్ కమ్యూనికేషన్ గడువు ముగిసిపోవడంతో కౌంటర్ మూసేసినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ విషయంగా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా కౌంటర్‌లో మాత్రం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతోందని బోర్డు పెట్టడం కొసమెరుపు. ఇప్పటికై నా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
● మూతపడ్డ కౌంటర్
● ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు


