డీజే మోత..గుండెకోత | - | Sakshi
Sakshi News home page

డీజే మోత..గుండెకోత

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

రాజంపేట టౌన్‌: ప్రస్తుతం కొన్ని ఉత్సవాలు, జాతర్లు, తిరునాళ్ల సందర్భంగా డీజేలను ఏర్పాటు చేయడం తప్పని అయింది. డీజే ద్వారా వచ్చే మ్యూజిక్‌కు డ్యాన్స్‌ చేసే వారికి ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఆ శబ్దం కొందరికి ప్రాణసంకటంగా మారుతుంది. పలు ప్రాంతాల్లో డీజేల వద్ద నృత్యం చేస్తూ మృతి చెందిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో డీజే శబ్దానికి పిట్టగోడ కూలి పలువురు మృతి చెందారు. డీజే శబ్దం వల్ల వినికిడిలోపం, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఒకవైపు వైద్యులు మీడియా, సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో రెండు వారాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేస్తారు. అయితే వీటి వల్ల మనిషికి ఎంతటి హాని కలుగుతుందన్న విషయమై ఉత్సవ కమిటీలు ఆలోచించాలని విద్యావంతులు కోరుతున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం కూడా డీజే సౌండ్‌పై కఠినమైన విధానం అవలంభించేలా చట్టం కూడా తీసుకురావాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వినిపిస్తోంది.

ఆరోగ్య సమస్యలు

సాధారణంగా రోడ్డుపై వెళ్లే సమయంలో వాహనాల వల్ల పెద్ద శబ్దాలు వస్తేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గంటల తరబడి రోడ్లపై డీజే శబ్దాలు ఉంటే రహదారిలో వెళ్లే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. డీజే శబ్దం వల్ల హృద్రోగులకు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అలాగే వృద్ధులు, పిల్లలు, గర్భిణీ మహిళలకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వినికిడిలోపం, గుండెపోటు వంటి సమస్యలు వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది.

అమలు కాని మార్గదర్శకాలు

శబ్దకాలుష్యంపై మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా అమలు అవుతున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ సమయంలో వీటివల్ల శబ్దం అధికంగా ఉంటుంది. బందోబస్తుగా ఉండే పోలీసు అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో చిన్న, చిన్న ఉత్సవాలకు సైతం డీజేలను ఏర్పాటు చేస్తున్నారు.

మార్గదర్శకాలు ఇలా....

] బహిరంగ ప్రదేశాల్లో 10 డిసేబుల్స్‌కు

మించి శబ్దం చేయరాదు

] ప్రైవేట్‌ ప్రదేశాల్లో డీజేలను పెట్టకూడదు

] లిఖిత పూర్వక అనుమతి లేకుండా

లౌడ్‌ స్పీకర్లు, సౌండ్‌ బాక్స్‌లు

ఏర్పాటు చేయకూడదు

] నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన

ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్‌ కొట్టడం

ఇతర శబ్దాలు చేయకూడదు

] సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్‌కు

మించి శద్దం ఉండకూడదు

] హాస్పిటల్స్‌, విద్యా సంస్థలు, దేవాలయాలు,

న్యాయ స్థానాలకు వందమీటర్ల

] లోపు డీజేలు కాని ఏ ఇతర సౌండ్‌ సిస్టంలను

ఏర్పాటు చేయకూడదు

ఉత్సవాల్లో తప్పని సరి అయిన డీజే

అధిక శబ్దం ప్రమాదమని వైద్యులు

హెచ్చరిస్తున్నా చర్యలు శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement