ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ, తాత్పర్య సహిత పోటీల విజేతలకు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావు, ఆయన సతీమణి లక్ష్మీలత దంపతుల కుటుంబం నగదు బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా దాతలతో పాటు కుటుంబ సభ్యు లు హేమలత మహాలక్ష్మి, నాగరమ్యలను ఇస్కాన్ మందిర అధ్యక్షుడు మధురేశ్ ప్రభూజీ ఘనంగా సత్కరించారు.
కాశినాయన సమాధి
సందర్శన
కాశినాయన : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతి క్షేత్రంలో కాశినాయన సమాధిని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, జిల్లా ఫారెస్ట్ అధికారి రాజశేఖర్‌బాబు, సబ్ డీఎఫ్‌ఓ సంకేత్ సునీత్ ఖర్గ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాశినాయన గుడి నిర్మాణం తొందరపడి చేపట్టరాదని, అటవీశాఖ అనుమతుల కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు గుడి నిర్మాణ అనుమతులపై విన్నవించగా.. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు.
రేపటి నుంచి శిక్షణ
కడప ఎడ్యుకేషన్ : కడప పట్టణంలోని శంకరాపురంలో ఉన్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈ నెల 7 నుంచి వారం రోజుల పాటు బేసిక్ ఆర్.ఎస్.ఎల్(రోవర్ స్కౌట్ లీడర్) బేసిక్ స్కౌట్ మాస్టర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్ బా షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చీఫ్ కమిషనర్ షేక్ శంషుద్దీన్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి పీఎం శ్రీ పాఠశాలల ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కోరారు.


